ఫ్రైడే రిలీజెస్‌ల‌లో ఆది టాప్ గేర్ వేశాడా?

Update: 2022-12-30 09:30 GMT
ప్ర‌తీ గురు, శుక్ర‌వారాల్లో కొత్త సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ గురు, శుక్ర‌వారాల్లోకూడా కొత్త సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశాయి. వీటి ప‌బ్లిక్ టాక్ ఏంటీ? .. ఏ సినిమా ఎలా వుంది?.. ప్రేక్ష‌కులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.  ఇందులో మూడు సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా, ఒ సినిమా మాత్రం నేరుగా ఓటీటీలోకి వ‌చ్చేసింది. 'కార్తికేయ 2' మూవీతో పాన్ ఇండియా వైడ్ గా  స‌క్సెస్ ని సొంతం చేసుకుని ఆ వెంట‌నే '18 పేజెస్' అంటూ మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ 'బ‌ట‌ర్ ఫ్లై' మూవీతో నేరుగా గురువారం ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వ‌చ్చేసింది.

థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో అనుప‌మ తొలి సారి ప్ర‌ధాన పాత్ర‌లో ట్రై చేసిన మూవీ ఇది. కిడ్నాప్ కు గురైన అక్క పిల్ల‌ల కోసం త‌పించే యువ‌తిగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించిన ఈ యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో డిసెంబ‌ర్ 29 గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అంత ఇంట్రెస్టింగ్ గ టాక్ లేకపోయినా ఒకే ఒక సారి ట్రై చెయ్యచ్చు అనే టాక్ ని సొంతం చేసుకుంది . ఇందులో లాయ‌ర్ గా భూమిక, కీల‌క పాత్ర‌లో రావు ర‌మేష్ లు న‌టించారు. ఆడ‌పిల్ల‌కు అమ్మ క‌డుపులో, స్మ‌శానంలో త‌ప్ప మ‌రెక్క‌డా రక్ష‌ణ లేద‌ని చెప్పే సినిమా ఇది.

ఇక ఈ మూవీ త‌రువాత ఈ ఫ్రైడే రోజున మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఆది సాయికుమార్ టాప్ గేర్‌ -  బిగ్‌బాస్ సోహైల్ 'ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌' - సాయి రోన‌క్ 'రాజ‌యోగం' థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. ఈ సినిమాల్లో ఆది సాయి కుమార్ న‌టించిన 'టాప్ గేర్' కి కొంచెం బెటర్  టాక్ వినిపిస్తుంది . క్యాబ్ డ్రైవ‌ర్ అనుకోకుండా డ్ర‌గ్స్ మాఫియాలో చిక్కితే ఏం జ‌రిగింది? దాని నుంచి త‌ను ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అనే ఆస‌క్తిక‌ర‌మైన‌న క‌థాంశంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కంచారు.

రియా సుమ‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీకి కె. శ‌శికాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కె. వి. శ్రీ‌ధ‌ర్ రెడ్డి నిర్క‌మించారు. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆది సాయికుమార్ కు 'టాప్ ట‌గేర్' ఊర‌ట‌క‌లిగించింద‌ని, ఇంత వ‌ర‌కు త‌ను చేసిన సినిమాల్లో ఈ మూవీ కొంచెం బెట‌ర్ అని టాక్ వ‌స్తోంది. ఇక బిగ్‌బాస్ సోహై హీరోగా ప‌రిచ‌యం అవుతూ చేసిన మూవీ 'ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌' పెద్దగా సౌండ్ లేదు. సాధార‌ణ క‌థ‌తో ఈ మూవీని రూపొందించారు.

ఇదే రోజు సాయి రోన‌క్ న‌టించిన 'రాజ యోగం' కూడా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రామ్ గ‌ణ‌ప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ఆదూరి ప్రతాప్ రెడ్డి నిర్మించారు. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌కుడు మెకానిక్ గా ప‌ని చేస్తూ విలాస‌వంత‌మైన జీవితాన్ని అనుభ‌వించాల‌ని క‌ల‌లు కంటుంటాడు. మ‌రి అలాంటి యువ‌కుడి జీవితం ఓ యువ‌తి కార‌ణంగా ఎలాంటి మ‌లుపులు తిరిగింది? .. ఇంత‌కీ రాజ‌యోగం ద‌క్కిందా? అన్న‌దే ఈ చిత్ర క‌థ‌. కాన్సెప్ట్ బాగున్నా క‌థ‌, క‌థ‌నాలు ఆక‌ట్టుకునే విధంగా లేక‌పోవ‌డంతో ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. గురు, శుక్ర‌వారాల్లో విడుద‌లైన సినిమాల్లో ఆది సాయి కుమార్ న‌టించిన 'టాప్ గేర్‌' కి కొంచెం బెటర్ టాక్ రావ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News