'పుష్ప' చిత్రాన్ని 'కేజీఎఫ్' తో పోల్చి బుచ్చిబాబు ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడా..?

Update: 2021-06-20 05:30 GMT
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'పుష్ప'. బన్నీ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా విడుదలకానున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిత్ర బృందం వదిలిన ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి చూస్తే అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. బన్నీ పాన్ ఇండియా ఎంట్రీకి ఇది పర్ఫెక్ట్ ఫిలిం అని అభిమానులు భావిస్తున్నారు.

అయితే ఇటీవల 'పుష్ప' సినిమా గురించి మాట్లాడిన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసే ప్రయత్నం చేశాడు. క్ల‌బ్ హౌస్ యాప్ లో ఈ చిత్రాన్ని పొగుడుతూ ఒక్క పుష్ప సినిమా 10 'కేజీఎఫ్' ల‌తో స‌మానమని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు మార్కు అందుకున్న బుచ్చిబాబుకు.. ఇప్పుడు ఈ మాటే ఇబ్బందులు తెచ్చిపెడుతోందట. హీరో ఎలివేషన్‌ సన్నివేశాలని నెక్స్ట్ లెవల్ లో చూపించిన 'కేజీఎఫ్' తో 'పుష్ప' చిత్రాన్ని పోల్చడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అదే సమయంలో ఓ డబ్బింగ్ సినిమాతో తమ హీరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని కంపేర్ చేయడమేంటని ఓ వర్గం బన్నీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తోంది.

'కేజీఎఫ్' ఎంతటి ఘన విజయం సాధించినా.. తెలుగు సినిమాతో కంపేరిజన్ చేసే పరిస్థితి వస్తే మాత్రం దాన్ని డబ్బింగ్ సినిమాగానే చూస్తారు తెలుగు సినీ అభిమానులు. ఇప్పుడు అదే సినిమాతో 'పుష్ప' చిత్రాన్ని బుచ్చిబాబు పోల్చి చెప్పడంతో.. తమ ఫేవరేట్ హీరో రేంజ్ ని త‌గ్గించిన‌ట్లుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న‌ట్లుగా తెలిసింది. తన గురువు సినిమా అనో.. ఫ్యూచర్ లో బన్నీ తో సినిమా ఉంటుందనో బుచ్చిబాబు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ మాట వారిని కాస్త ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై అల్లు కాంపౌండ్ వ‌ర్గాలు ఏమనుకుంటున్నారో మరి. ఏదేమైనా త‌న‌కు ప్ర‌త్య‌క్షంగా సంబంధం లేని ఓ సినిమాని పొగిడి ఇప్పుడు ఇలా ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకని బుచ్చిబాబు ను ఉద్దేశించి కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News