దిల్ రాజు ముందే జాగ్ర‌త్త పడ్డారా?.. అదెలా?

Update: 2022-07-23 05:51 GMT
క‌రోనా కార‌ణంగా చాలా వ‌ర‌కు సినిమాల ప‌రిస్థితి దారుణంగా మారింది. కొన్ని నిర్మాణం ప‌రంగా ఆల‌స్యం అవుతూ వ‌చ్చాయి. కొన్ని నిర్మాణం పూర్త‌యినా రిలీజ్ కి మంచి స‌మ‌యం ల‌భించ‌క‌పోవ‌డంతో వాయిదాలు ప‌డుతూ వ‌చ్చాయి. దీంతో నిర్మాత‌లు వ‌డ్డీల రూపంలో భారీ న‌ష్టాలు చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఈ ఇబ్బందుల్ని అధిగ‌మించి సినిమాని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే అందులో చాలా వ‌ర‌కు సినిమాలు రెండు వారాల‌కు మించి ఆడ‌ని ప‌రిస్థితి.

టికెట్ రేట్లు పెరిగిపోవ‌డం. రెండు, మూడు వారాల్లో ఓటీటీల్లోకి సినిమా వ‌చ్చేస్తుండ‌టంతో ప్రేక్ష‌కులు పెద్ద‌గా థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. దీంతో చాలా వ‌ర‌కు సినిమాలు న‌ష్టాల‌ని ఎదుర్కొంటున్నాయి. పాన్ ఇండియా మూవీస్ త‌ప్ప మిమిమ‌మ్ రేంజ్ సినిమాల‌కు థియేట‌ర్ల‌లో ఆద‌ర‌ణ క‌రువు అవుతోంది. ఈ నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు నిర్మాత‌లు సేఫ్ బ‌డ్జెట్ తో సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. పేరున్న సినిమాలు ఆక‌ట్టుకోలేకపోతున్న నేప‌థ్యంలో ముందే సేఫ్ జోన్ లో వుండాల‌ని ప‌క్కా ప్లాన్ లు చేసుకుంటున్నారు.

తాజాగా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కూడా అలాంటి మాస్టార్ ప్లాన్ తోనే రంగంలోకి దిగిన‌ట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ 'థాంక్యూ'. నాగ‌చైత‌న్య హీరోగా 'మ‌నం' ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ రూపొందించిన మూవీ ఇది. అయితే ముందు నుంచి ఈ మూవీకి పెద్ద‌గా బ‌జ్ లేదు. దానిక త‌గ్గ‌ట్టే శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీకి ఆశించిన ఫ‌లితం రాలేదు. బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రిస్థితి ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేద‌ని తెలుస్తోంది.

తొలి రోజే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీకి ఆకాల వ‌ర్షాలు కూడా ప్ర‌ధాన అడ్డంకిగా మారాయి. ఈ ప‌రిస్థితుల‌లో దిల్ రాజు ప‌రిస్థితి ఏంటీ? .ఆయ‌న‌కు ఈ మూవీతో న‌ష్టాలు త‌ప్పవా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్క‌డో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే 'థాంక్యూ'కి డివైడ్ టాక్ వ‌చ్చినా స‌రే దిల్ రాజ్ ద‌ర్జాగా సేఫ్ జోన్ లో వున్నార‌ట‌. కార‌ణంగా సినిమాని ప‌రిమిత బ‌డ్జెట్ లోనే నిర్మించార‌ట‌. అంతే కాకుండా ఇప్ప‌టికే డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ ని కూడా లాభాల‌కే అమ్మేశార‌ని తెలిసింది.

డిజిట‌ల్ రైట్స్ ని సోనిలివ్ కి రూ.12 కోట్ల‌కు అమ్మేశార‌ట‌. అంతే కాకుండా శాటిలైట్ రైట్స్ రూపంలోనూ ఆయ‌న‌కు భారీ మొత్త‌మే అందింద‌ని టాక్‌. ఇటీవ‌ల 'ఎఫ్ 3' వ‌ల్ల కొంత మేర న‌ష్టాల‌ని చూసిన బ‌య్య‌ర్ల‌కు ఈ మూవీని త‌క్కువ మొత్తం లాభాల‌కే దిల్ రాజు అమ్మేశార‌ట‌.

దీంతో దిల్ రాజు లెక్క‌ల ప్ర‌కారం సినిమా వ‌న్ వీక్ గ‌ట్టిగా ఆడితే వాళ్లు సేఫ్‌.. సినిమా పోయినా త‌న‌ని ప‌ట్టుకునే వాళ్లు లేరు. ఈ ప్లాన్ ని ప‌క్కాగా అమ‌లు చేవారు కాబ‌ట్టే ఈ రోజు 'థాంక్యూ' విష‌యంలో దిల్ రాజు సేఫ్ జోన్ లో వున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.
Tags:    

Similar News