శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనగానే వెంటనే దిల్ రాజు గుర్తుకొస్తారు. బయటకు కనిపించేది ఆయనే కావడంతో అంతా దిల్ రాజుగారే అన్నట్టుగా ఉంటుంది. అయితే ఈ సంస్థలో దిల్ రాజు- శిరీష్ - లక్ష్మణ్ ముగ్గురూ కీలక పాత్ర పోషిస్తారు. సినిమా నిర్మాణమే కాకుండా డిస్ట్రిబ్యూషన్.. థియేటర్ల విషయంలో ముగ్గురూ ఏకతాటిపై ఉంటూ ఇరవై ఏళ్ళు తమ అనుబంధం కొనసాగించారు. అయితే ఈ కాంపౌండ్ చీలిక వస్తోందని టాక్ వినిపిస్తోంది.
లక్ష్మణ్ ఈ గ్రూప్ లో నుంచి బయట కు వస్తున్నారని.. సొంత నిర్మాణ సంస్థ మొదలు పెట్టే అవకాశం కూడా ఉందని అంటున్నారు. సినిమాల క్రెడిట్ అంతా రాజుగారి ఖాతాలో పడుతూ ఉండడం.. రాజుగారికి తప్ప తనకు నిర్మాతగా పేరు రాకపోవడంతో లక్ష్మణ్ అప్సెట్ అయ్యారని అంటున్నారు. టాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థ అయిన వెంకటేశ్వర క్రియేషన్స్ లో మార్పులు చోటు చేసుకోవడం తప్పదని అంటున్నారు.
ఇదిలా ఉంటే థియేటర్ లీజ్ అగ్రిమెంట్స్ మొత్తం లక్ష్మణ్ పేరు మీదే ఉన్నాయని దీంతో ఈ చీలిక వస్తే మాత్రం థియేటర్ల విషయంలో రాజుగారికి ఇంతకు ముందు ఉన్నంత గ్రిప్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఏదేమైనా దిల్ రాజు కాంపౌండ్ లో ఈ చీలిక వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.