పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ ఎంత బీజీగా ఉందో? చూస్తూనే ఉన్నాం. పార్టీ శ్రేణులతో సమావేశానికే పవన్ కి సి సమయం సరిపోవడం లేదు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో పార్టీలన్ని ప్రచారంలో నిమగ్నమవ్వడానికి పావులు కదుపుతున్నాయి. జనసేన మాత్రం ఇంకా అలాంటి పనులు స్పీడప్ చేయలేదు.
పవన్ ఇప్పుడిప్పుడే ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. మరోవైపు చేతిలో ఉన్ని సినిమాలు వీలైనంత త్వరగా పూర్తిచేసి సంపూర్ణంగా రాజకీయాల్లో బిజీ అవ్వాలన చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తమిళ సినిమా 'వినోదాయ సిద్దం' ని రీమేక్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. తొలుత ఇది గాలి వార్తలా భావించినా ఆ తర్వాత నెమ్మది ప్రాజెక్ట్ వెనుక సీరియస్ నెస్ అర్ధమైంది.
'భవధీయుడు భగత్ సింగ్' ని సైతం పీకే పక్కనబెట్టి ఈ సినిమాకి డేట్లు కేటాయించడంతో చాలా ప్రత్యేకమైన సినిమాగా మీడియాలో హైలైట్ అయింది. ఆ తర్వాత ఇదే సినిమాలో మేనల్లుడు సాయితేజ్ పవన్ కి ధీటైన పాత్రలో నటిస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. దీంతో వెబ్ మీడియాలో రకరకాల కథనాలు. మేనల్లుడు కోసమే పీకే కమిట్ అయ్యాడా? అతనికి బూస్టింగ్ ఇవ్వడానికే తెరను పంచుకుంటున్నాడా? అన్నంతగా ప్రచారం సాగింది.
కానీ అసలి సంగతి ఇది అని తాజాగా వెలుగులోకి వస్తుంది. వినోదాయ సిద్దంకి పవన్ కేటాయించేది కేవలం 12-15 రోజులు డేట్లు మాత్రమే. ఆ తర్వాత మేజర్ పార్ట్ షూటింగ్ అంతా మేనల్లుడిపైనే ఉంటుందిట. రెండు వారాల షెడ్యూల్ అంటే పవన్ కి పెద్ద విషయం కాదు. ఆడతా పాడతా షూట్ కి హారైనా ఆయనపై చిత్రీకరణ ముగించవచ్చు.
'అదే భవదీయుడు' సినిమాకైతే కొన్ని నెలలు డేట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆ సినిమా పూర్తిచేసి రిలీజ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అభిమానులకు బాగా గ్యాప్ ఇచ్చినట్లు అవుతుంది. ఇవన్నీ ఆలోచించే రాజకీయ ప్రచారంలో బిజీ అయ్యే ముందు రెండు సినిమాలు చేసి వస్తే అభిమానులు ఖుషీగా అవుతారు.
సినిమా ప్రేక్షకాభిమానులతోనూ మమేకమై ఉన్నట్లు ఉంటుందని పవన్ కమిట్ అయినట్లు గుస గుస వినిపిస్తుంది. పైగా ఈ ప్రాజెక్ట్ కి ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ రచన అందిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలు మాతృక దర్శకుడు సముద్రఖని చేపడుతున్నా త్రివిక్రమ్ పర్యవేక్షణ కూడా ఉంటుంది. కాబట్లి ప్రాజెక్ట్ సేఫ్ జోన్ లో ఉంటుంది.
ఇలా ఇన్ని కారణాలు పవన్ ని 'వినోదాయ సిద్దం' వైపు అడుగులు వేయించి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమా షూట్ తో సంబంధం లేకుండానే వినోదాయ సిద్దంకి క మిట్ అయ్యారు అన్నది తెలిసిందే.