పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడున్నరేళ్ల విరామం తరువాత మళ్లీ 'వకీల్ సాబ్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అనిపించుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 'వకీల్ సామ్' మూవీని బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' ఆధారంగా చేసిన పవన్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కూడా మరో రీమేక్ మూవీనే ఎంచుకోవడం గమనార్హం. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ని తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
'భీమ్లానాయక్' పేరుతో రీమేక్ అయిన ఈ మూవీకి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. రానా కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తరువాత పవన్ నుంచి 'హరి హర వీరమల్లు' వస్తుందని అంతా ఆశించారు కానీ వరుస రాజకీయ సమావేశాల కారణంగా ఈ మూవీ షూటింగ్ నానాటికీ ఆలస్యం అవుతూ వస్తోంది.
క్రిష్ డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. పవన్ పాల్గొనగా ఇటీవల కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. పవన్ కల్యాణ్ రాజకీయ మీటింగ్ లని బట్టి అందుబాటులో వున్న సమయంలో ఈ మూవీ షూటింగ్ ని జరుపుతున్నారు. ఈ మూవీని 2023 వేసవిలో విడుదల చేయాలని దర్శకుడు, నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. అందు కోసం షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదిలా వుంటే పవన్ కల్యాణ్ తన బిజీ షెడ్యూల్ కారణంగా మరో దర్శకుడికి బిగ్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
గత రెండేళ్లుగా హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తూ మరో ప్రాజెక్ట్ ని అంగీకరించని విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి పవన్ 'తేరీ' రీమేక్ కోసం వర్క్ చేయమని హరీష్ శంకర్ కు సలహా ఇచ్చి షాక్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పవన్ రీసెంట్ గా తమిళ హిట్ మూవీ 'వినోదాయ సితం' తెలుగులో రీమేక్ లో నటించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించాలని ప్లాన్ చేసింది.
ఈ మూవీ కోసం పవన్ కు భారీ స్థాయిలో అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. ఈ మూవీకి మాతృకలో నటించి తెరకెక్కించిన సముద్రఖని దర్శకుడిగా కూడా ఫైనల్ చేశారు. కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ ని పవన్ కల్యాణ్ నిలిపి వేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు సిద్ధం కావాలనే ఆలోచనలో భాగంగానే పవన్ ఈ మూవీని పక్కన పెట్టాడా? లేక ప్రస్తుతం తను వున్న బిజీ వల్ల ఈ మూవీని పక్కన పెట్టాడా? అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.