ఇప్పుడంటే పూరి కాస్త స్పీడ్ తగ్గించాడుగానీ .. ఇంతకుముందు ఆయన సినిమా రీల్ కంటే ఫాస్టుగా పరిగెత్తారు. కథ .. కథనాలు తయారు చేసుకోవడం .. నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంచుకోవడం .. చకచకా షూటింగును పూర్తిచేయడం .. అంతే ఫాస్టుగా రిలీజ్ కి పంపించడం. ఇలా ఎక్కడా ఆలస్యం కాకుండా ఆయన నుంచి అవుట్ పుట్ బయటికి వచ్చేది. తెలుగు తెరపై కథల కాళ్లకు చక్రాలు కట్టేసి పరిగెత్తించిన దర్శకుడిగా ఆయన పేరునే అంతా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి పూరి తన కెరియర్ ను మొదలుపెట్టేసి, 22 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ మొత్తం జర్నీలో ఆయన స్టార్ హీరోయిన్స్ ను పట్టుకుని వేళ్లాడటం ఎక్కడా కనిపించదు. తన సినిమాల ద్వారా ఆయన చాలామంది కథానాయికలను తెలుగు తెరకి పరిచయం చేశారు. 'బద్రి' సినిమాతో ఆయన రేణు దేశాయ్ ని .. అమీషా పటేల్ ను పరిచయం చేశారు. ఆ తరువాత 'సూపర్' సినిమాతో అనుష్కను .. అయోషా టకియాను పరిచయం చేశారు. ఈ సినిమా తరువాత అనుష్క ఏ స్థాయికి ఎదిగిందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అలాంటి హీరోయిన్ ఇంతవరకూ తెరపై కనిపించలేదని చెప్పుకుంటూ ఉంటారు.
ఇక ఆయన 'ఇడియట్' సినిమా ద్వారా రక్షితను .. 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' ద్వారా అసిన్ ను .. 'దేశముదురు' సినిమాతో హన్సికను తెలుగు తెరకి కథానాయికలుగా పరిచయం చేశారు. ఈ మూడు సినిమాలు కూడా పూరి కెరియర్లో చెప్పుకోదగిన విజయాలను సాధించాయి.
ఈ ముగ్గురూ కూడా ఎవరి ప్రత్యేకతను వారు చాటుకున్నారు. అసిన్ .. హన్సిక ఇద్దరూ కూడా తమిళంలో స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పేశారు. తమిళనాట హన్సికకు గుడి కూడా కట్టేశారు. తమిళంతో పాటు అడపా దడపా ఆమె తెలుగు తెరపై కనిపిస్తూనే ఉంది.
ఇక పూరి పరిచయం చేసిన హీరోయిన్స్ లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసి, ఆ తరువాత నిలదొక్కుకోలేక పోయినవారు చాలామంది ఉన్నారు. 'బాచి' సినిమాలో మెరిసిన నీలాంబరి .. '143'లో సందడి చేసిన 'సమీక్ష' .. 'చిరుత'లో చెలరేగిపోయిన నేహా శర్మ .. 'నేనింతే'లో అలరించిన సియా గౌతమ్ .. 'ఇజమ్' లో కవ్వించిన అదితి ఆర్య .. 'పైసా వసూల్' లో అందాలు ఆరబోసిన ముస్కాన్ .. 'మెహబూబా'లో కనువిందు చేసిన నేహా శెట్టి ఆ జాబితాలో కనిపిస్తారు.
ఇక 'ఏక్ నిరంజన్'తో పరిచయమైన కంగనా .. 'లోఫర్'తో ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ ఆ తరువాత బాలీవుడ్ కే పరిమితమయ్యారు. ఇక త్వరలో పూరి నుంచి రానున్న 'లైగర్' సినిమాతో అనన్య పాండే పరిచయమవుతోంది. ఇంతమంది కొత్త హీరోయిన్స్ ను పరిచయం చేసిన పూరికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!