అదేంటీ రెజీనా అంత మాట‌నేసింది?

Update: 2022-09-26 10:50 GMT
అభిన‌యం, అంత‌కు మించిన అందం వున్నా ఆశించిన స్థాయిలో అవ‌కాశాల్ని.. త‌న స్థాయికి త‌గ్గ గుర్తింపుని సొంతం చేసుకోలేక రెజీనా స‌త‌మ‌త‌మ‌వుతోంది. అడివి శేష్ తో క‌లిసి న‌టించిన 'ఎవ‌రు' మూవీతో బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న రెజీనా ఆ స్థాయి విజ‌యాల్ని సొంతం చేసుకోలేక‌.. అంత‌కు మించిన అవ‌కాశాల్ని ద‌క్కించుకోలేక ఇబ్బందులు ప‌డుతోంది. లేటెస్ట్ గా 'శాకిని డాకిని' మూవీతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసినా ఆ ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది.

సినిమా ఆడ‌క‌పోయినా ఈ మూవీ ప్ర‌యోషన్స్ తో రెడీనా 'మ్యాగీ.. మ‌గాళ్లు టూ మినిట్స్‌' అంటూ చేసిన ర‌చ్చ నెట్టింట మామూలుగా పేల‌లేదు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైర‌ల్ గా మారి రెడ‌జీనాని ట్రెండ్ అయ్యేలా చేసింది.

ఈ మూవీ నుంచి య‌మ ఫాస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ పంచ్ లు వేస్తున్న రెడీనా తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ పై వేసిన పంచ్ ఓ రేంజ్ లో పేలి నెట్టింట వైర‌ల్ గా మారింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ రూపొందించిన ఎంట‌ర్ టైన‌ర్ 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌'.

ఈ మూవీ రిలీజ్ అయి ఏడేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా హ‌రీష్ శంక‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్భంగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు, హీరో స‌న్నిహితుడు స‌తీష్ కు, చిత్ర బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట్ ని షేర్ చేశాడు. అయితే ఇందులో సీత‌గా న‌టించిన రెజీనాని హ‌రీష్ శంక‌ర్ పూర్తిగా మ‌ర్చిపోయాడు. ఇదే ఇప్ప‌డు అత‌నికి దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చేలా చేసింది.

హ‌రీష్ శంక‌ర్ చేసిన పోస్ట్ ని రీ ట్వీట్ చేస్తూ రెడీనా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. 'నా 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌' డైరెక్ట‌ర్ కు మిగిలిన వాళ్ల గురించి మాట్లాడ‌టానికి క్యారెక్ట‌ర్ లేన‌ట్టుగా వుంది. మ‌మ్మ‌ల్ని ఇన్స్ స్పైర్ చేసినందుకు థాంక్యూ. సీత‌తో అంత ఈజీ కాదు' అంటూ హ‌రీష్ శంక‌ర్ కు దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇవ్వ‌డం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. అదేంటి రెజీనా అంత మాట‌నేసింద‌ని కొంత మంది అని అవాక్క‌వుతున్నారు.

రెజీనా ట్వీట్ పై హ‌రీష్ శంక‌ర్ మాత్రం సారీ అంటూ తేల్చేయ‌డం గ‌మ‌నార్హం. నెట్టింట త‌న‌పై వ‌చ్చే సెటైర్ల‌కు అంతే స్పాంటెనియ‌ర్ గా స్పందిస్తూ పంచ్ లు వేసే హ‌రీష్ శంక‌ర్ .. రెజీనాకు మాత్రం కౌంట‌ర్ ఇవ్వ‌డానికి సాహ‌సించ‌క‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News