ప్ర‌భాస్ సినిమా స్టోరీ ఏంటో మేక‌ర్స్ చెప్పేశారా?

Update: 2022-09-01 10:55 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తో చేస్తున్న మైథ‌లాజిక‌ల్ డ్రామా 'ఆది పురుష్‌' షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ వ‌ర్క్ చేస్తున్నారు. ఇక ప్ర‌శాంత్  నీల్ తో చేస్తున్న‌ 'స‌లార్‌' కూడా 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ఈ రెండు భారీ ప్రాజెక్ట్ లతో పాటు ప్ర‌బాస్ న‌టిస్తున్న మూడ‌వ సినిమా 'ప్రాజెక్ట్ కె'.

సైన్స్ ఫిక్ష‌న్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై భారీ సినిమాల నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. 'మ‌హాన‌టి' ఫేమ్ నాగ్ అశ్విన్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా దాదాపు రూ. 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకోన్‌, దిషా ప‌టాని న‌టిస్తుండ‌టంతో ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్ర‌భాస్ న‌టిస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో ఒక‌టిగా ప్ర‌త్యేకంగా నిలిచింది.

హిమాల‌యాల్లోని ఓ ప్ర‌త్యేక సొరంగం నేప‌థ్యంలో సాగే టైమ్ ట్రావెల్ మూవీగా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. సైన్స్ ఫిక్ష‌న్ ఫాంట‌సీ డ్రామాగా అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి ఇండియ‌న్ హిస్ట‌రీకి సంబంధం వుంటుంద‌ని తెలుస్తోంది. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఓ థియ‌రీ కూడా వుంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  

రీసెంట్ గా బుధ‌వారం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. 'ఒక‌ప్పుడు వేద‌వ్యాసునికి మ‌హాభార‌తం రాయ‌డానికి స‌హాయం చేశావు..ఇప్పుడు మా భార‌తానికి కూడా మీ ఆశీర్వాదం కావాలి విఘ్నేశ్వ‌రా' అని స‌ద‌రు పోస్ట‌ర్ లో వెల్ల‌డించారు. అంటే 'ప్రాజెక్ట్ కె'కు భార‌తానికి సంబంధం వుంద‌ని ఇండైరెక్ట్ గా మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చార‌న్న‌మాట‌.

ఇంత‌కీ 'ప్రాజెక్ట్ కె' అంటే ఏంటీ? ..భార‌తానికి ఈ చిత్ర క‌థ‌కు వున్న సంబంధం ఏంటీ? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని లుక్ లు, మేక‌ర్స్ వ‌దిలే న్యూస్ ని అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఈ మూవీకి సీనియ‌ర్ ద‌ర్శ‌కులు సింగీతం శ్రీ‌నివాస‌రావు మెంట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News