సినిమా ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ వుంటేనే ఇక్కడ విలువ ఎక్కువ అది లేకపోతే ఎలాంటి వారినైనా ఇక్కడ పట్టించుకునేవారు వుండరు. ఈ సత్యం తెలిసిన చాలా మంది ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా సక్సెస్ తో సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఎవరు ఎలాంటి అవకాశం కల్పించినా ఈగోలకి వెళ్లకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
అయితే కొన్ని సార్లు అలాంటి ప్రయత్నాలు మిస్ ఫైర్ అవుతుంటాయి. కెరీర్ ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ ఇలాగే ఓ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. తనకు సన్నిహితంగా వుండే ఓ స్టార్ హీరో సినిమాకు అతన్నిదర్శకత్వం వహించే అవకాశం ఇప్పించాడు.
అయితే డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతల్ని మాత్రం తనే తీసుకుని కేవలం డైరెక్షన్ చేసే అవకాశం మాత్రం బిగ్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడికిచ్చారు.
అది రీమేక్ మూవీ. విభిన్నమైన రెండు చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన సదరు దర్శకుడు స్టార్ హీరోతో సినిమా అంటే ఎగిరిగంతేశాడు.. మొత్తానికి సినిమా చేశాడు. బిగ్ ప్రొడక్షన్ కంపనీ అ మూవీని నిర్మించింది.
అయితే దర్శకుడిగా పేరున్న మొత్తం చక్కబెట్టింది మాత్రం స్టార్ డైరెక్టరే అనే ముద్ర పడిపోయింది. దీంతో స్టార్ హీరోతో తొలి సినిమా చేశానన్న తృప్తి తప్ప క్రెడిట్ అతనికి ఎంత మాత్రం దక్కలేదు. క్రెడిట్ మొత్తం స్టార్ డైరెక్టర్ కే వెళ్లిపోయింది.
స్టార్ తో సినిమా చేసిన దర్శకుడికి ఇప్పుడు సినిమా లేదు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ యువ దర్శకుడికి అవకాశం ఇచ్చి అతని కెరీర్ కి హెల్ప్ చేశాడా? లేక అతని కెరీర్ ని కిల్ చేశాడా? అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలై నెలలు కావస్తున్నా సదరు దర్శకుడి చేతిలోమరో సినిమా లేకపోవడం గమనార్హం.