స్టార్ డైరెక్ట‌ర్ కు క్లారిటీ వ‌చ్చేసిందా?

Update: 2022-07-02 12:30 GMT
స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కు ఫుల్ క్లారిటీ వ‌చ్చేసిందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ప‌దేళ్ల క్రితం `గ‌బ్బ‌ర్ సింగ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించారు హ‌రీష్ శంకర్ . అప్ప‌టి వ‌ర‌కు భారీ ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన ప‌వ‌ర్ స్టార్ ఒక్క‌సారిగా ఈ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. దీంతో వీరిద్ద‌రిది హిట్ కాంబినేష‌న్ గా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్ష‌కుల్లోనూ ముద్ర‌ప‌డిపోయింది.

వీరిద్ద‌రు క‌లిసి సినిమా ఎప్పుడు చేస్తారా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వేళ గ‌త ఏడాది ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నామంటూ ప్ర‌క‌టించారు. `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌` పేరుతో కొత్త త‌రహా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ప్ల‌స్ పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌నుకున్నారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ మూవీని నిర్మించ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసింది. టైటిల్ ఫ‌స్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే చ‌క చ‌కా షూటింగ్ మొద‌లు పెట్ట‌డ‌మే త‌రువాయి. కానీ ప‌వ‌న్ మాత్రం అందుకు ఏమాత్రం సిద్ధంగా లేడు. ప్ర‌స్తుతం త‌మిళ హిట్ `వినోదాయ సితం` మూవీ రీమేక్ తో పాటు `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`లో న‌టిస్తున్నారు. `వినోదాయ సితం`కు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌కుడు. ఈ రెండు సినిమాల త‌రువాత ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా అక్టోబ‌ర్ నుంచి రాజ‌కీయ ప్ర‌చారం కోసం ఏపీలో బ‌స్సు యాత్ర చేయ‌బోతున్నారు.

దీంతో హ‌రీష్ శంక‌ర్ సినిమా `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌` కు డేట్స్ కేటాయించ‌డం క‌ష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలో త‌న సినిమా ఈ ఏడాది ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మ‌నే క్లారిటీకి హ‌రీష్ శంక‌ర్ వ‌చ్చేశార‌ట‌.

ప‌వ‌న్ కోసం వేచి చూడ‌టం ప‌క్క పెట్టి ఈ టైమ్ లో మిడ్ రేంజ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌య‌న‌లో వున్నార‌ట‌. ఉస్తాద్ రామ్ హీరోగా ఓ మూవీని రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని, అందు కోస‌మే రామ్ తో క‌లిసి ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

రామ్ ప్ర‌స్తుతం ఎన్‌. లింగు స్వామి ద‌ర్శ‌క‌త్వంలో `ది వారియ‌ర్‌` మూవీ చేశారు. జూలై 14న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ త‌రువాతే హ‌రీష్ శంక‌ర్ ప్రాజెక్ట్ ని రామ్ అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.
Tags:    

Similar News