సినిమా అంటే కొంత మందికి ప్యాషన్.. కొం మందికి ప్రాణం. సినిమా కోసం ఏది చేయడానికైనా సిద్ధపడుతుంటారు. భరించలేని బాధని కూడా ఆనందంగా భరిస్తూ సినిమా రంగంలో తమని ఆరాధించే వారి కోసం శ్రమిస్తుంటారు. క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఇదే తరహాలో బాధని ఆనందంగా భరిస్తూ అభిమానుల కోసం శ్రమించిందట. వివరాల్లోకి వెళితే.. మలయాళ మూవీ `ప్రేమమ్`తో మలర్ గా పాపులర్ అయిన సాయి పల్లవి ఆ సినిమాతో తెలుగులో అవకాశాన్ని సొంతం చేసుకుంది.
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ స్టోరీ `ఫిదా`తో తెలుగు ప్రేక్షకుల్ని ఒక్కసారిగా ఫిదా చేసేసింది. తనదైన నటన, మెస్మరైజ్ చేసే డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకుల హదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. క్రేజీ కథనాయికగా హీరోల తరహాలో క్రేజ్ ని, స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది. సాయి పల్లవి సినిమాలో వుందంటే ప్రేక్షకులు థియేటర్లలకు వచ్చేలా ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ ని దక్కించుకున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
ఈ మధ్య కాలంలో ఈ తరహాలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి కావడంతో ఆమె సినిమాలంటే ప్రేక్షకులు అమితాసక్తిని చూపించడం మొదలు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుని రికార్డు సాధించిన సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది. తన ఫ్యాన్స్ ని ఏ విషయంలోనూ నిరుత్సాహ పరచకూడదని సాయి పల్లవి `ఫిదా` మూవీ నుంచి `శ్యామ్ సింగరాయ్` సినిమాల వరకు మెస్మరైజింగ్ డ్యాన్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే.
అయితే `శ్యామ్ సింగరాయ్`లోని క్లాసికల్ డ్యాన్స్ నంబర్ టైమ్ నుంచి ప్రతీ పాటకు డ్యాన్స్ చేయడానికి చాలా ఇబ్బందిపడిందట. ఆ బాధని పంటి బిగువున భరిస్తూ ఫ్యాన్స్ ని సంతోష పెట్టడానికి ప్రయత్నించిందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిందని నెట్టింట ఓ వర్త వైరల్ అవుతోంది. ఇటీవల ఓ మీడియాకు ప్తర్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి షాకింగ్ విషయాల్ని వెల్లడించినట్టుగా చెబుతున్నారు.
పీరియడ్స్ టైమ్ లో డ్యాన్స్ చేయడం తనకు కష్టంగా అనిపించిందని, అది తనని శారీరకంగా, మానసికంగా దెబ్బతీసిందని, `శ్యామ్ సింగరాయ్`లోని క్లాసికల్ సాంగ్ నుంచి తను చేసిన ప్రతీ పాటని పీరియడ్స్ టైమ్ లోనే చేశానని సాయి పల్లవి చెప్పిందట. అయితే ఈ వార్త ఫ్యాన్స్ ని షాక్ కు గురిచేస్తోంది. చేసే వృత్తి పట్ల, తనని అభిమానించే అభిమానుల పట్ల సాయి పల్లవికి వున్న డెడికేషన్ ని ఈ సంఘటన తెలియజేస్తోందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.