మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఫాంటసీ మూవీ 'ఓరి దేవుడా!'. తమిళంలో అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓ మై కడవులే' ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. ఇందులోని కీలక అతిథి పాత్రలో దేవుడిగా మక్కల్ సెల్వన్, వెర్సటైల్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి నటించాడు. తను చేసిన పాత్రనే తెలుగులో విక్టరీ వెంకటేష్ పోషించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ శుక్రవారం విడుదలైన 'ఓరి దేవుడా' బాగుందనే టాక్ ని సొంతం చేసుకుంది.
తమిళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో పీవీపీ సినిమా నిర్మించిన ఈ మూవీలో ఎప్పుడైతే వెంకీ మామ నటిస్తున్నాడని న్యూస్ బయటికి వచ్చిందో అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వెంకటేష్ నటిస్తున్న విషయాన్ని మాత్రం మేకర్స్ బలంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లలేకపోయారు.
కారణం ఈ మూవీ ప్రమోషన్స్ లో విక్టరీ వెంకటేష్ పెద్దగా పాల్గొనకపోవడమే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి 'కిసీకీ భాయ్ కిసీకీ జాన్' అనే మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ కారణంగానే ఈ మూవీ ప్రమోషన్స్ కి పెద్దగా హాజరు కాలేకపోయాడట. అదే ఈ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
పోస్టర్లలో ప్రధానంగా వెంకటేష్ ని చూపించే ప్రయత్నం చేసినా తనది గెస్ట్ రోల్ అని తేలడంతో చాలా వరకు ఫ్యాన్స్ కూడా నిరుత్సాహానికి గురయ్యారు. వెంకీ పాత్ర ఫస్ట్ హాఫ్ కె పరిమితం కావడం.. ఆ తరువాత క్లైమాక్స్ లో మాత్రమే కనిపించడంతో అభిమానులు కొంత వరకు అసంతృప్తికి లోనయ్యారు.
అయితే ఓవరాల్ గా ఈ మూవీకి వెంకీ మామ క్యారెక్ట్ వల్లే సినిమాకు క్రేజ్ ఏర్పడటంతో ఫ్యాన్స్ కొంత వరకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. ఆ కారణంగానే విశ్వక్ సేన్ ఫ్యాన్స్ తో కలిసి వెంకీ మామ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రిలీజ్ రోజు హంగామా చేయడంతో 'ఓరి దేవుడా' విషయంలో వెంకీ మామ ఇంపాక్ట్ చూపించాడని క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రమోషన్స్ లో వెంకటేష్ పాల్గొని వుంటే ఆ ఇంపాక్ట్ వేరేగా వుండేదని, ఓపెనింగ్ కలెక్షన్స్ ఓ రేంజ్ లో వుండేవని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి అంతేగా..అంతేగా..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.