రౌడీని త‌ప్పుగా అర్థం చేసుకున్నారా.. లేక కావాల‌నే!

Update: 2022-08-19 06:30 GMT
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ మూవీ 'లైగ‌ర్‌'. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కించారు. బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తాల‌తో క‌లిసి నూరి, ఛార్మి ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌' తీవ్ర నిరాశ ప‌ర‌చ‌డంతో దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న 'లైగ‌ర్‌' పై విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

దీంతో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం క్ష‌ణం తీరిక లేకుండా దేశ వ్యాప్తంగా వున్న ప్ర‌ధాన సీటీస్ లో ఫ్యాన్ డమ్ పేరుతో ప్ర‌మోష‌న్స్ లో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పాల్గొంటూ ప్రేక్ష‌కుల్ని, ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇదిలా వుంటే రీసెంట్ గా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హైద‌రాబాద్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ తెలుగు మీడియాతో ప్ర‌త్యేకంగా స‌మావేశమ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా చాలా రోజుల త‌రువాత క‌లిసాం స‌ర‌ద‌గా చిల్ అవుదాం. ఎలాంటి ఫార్మాలిటీస్ ఏవీ పాటించ‌కుండా ఫ్రీగా వుందాం అంటూ మీడియాతో స‌ర‌దాగా క‌లిసిపోయే ప్ర‌య‌త్నం చేశాడు.

మొద‌టి నుంచి త‌ను ఏ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్నా.. మీడియా మీట్ లో వున్నా త‌నదైన పంథాలో హీరోని నేను, సెల‌బ్రిటీని అనే స్థాయిలో బిహేవ్ చేయ‌కుండా స‌ర‌ద‌గాకా మ‌న ప‌క్కింటి అబ్బాయి.. మ‌న ఇంట్లో వాడిగా క‌లివిడిగా మాట్లాడ‌టం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అల‌వాటు. జోవియ‌ల్ గా వుంటూ స‌ర‌దాగా క‌లిసి పోవాల‌ని త‌న మ‌న‌సులో ఏముందో దాన్ని అంతే నిజాయితీగా బ‌య‌టికి వ్య‌క్తం చేస్తూ వుంటాడు. దాని వ‌ల్ల  కొన్ని సంద‌ర్భాల్లో వివాదాలు చుట్టుముట్టిన సంద‌ర్భాలున్నాయి. అది అర్థం చేసుకోలేని వాళ్లు చేసిన ప‌నులే కానీ త‌ను కావాల‌ని యాటిట్యూడ్ చూపించినవి కాదు.

తాజాగా ఇలాంటి సంఘ‌ట‌ను ఒక‌టి హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్రెస్ మీట్ లో జ‌రిగింది. తెలుగు మీడియాని చాలా రోజుల త‌రువాత క‌లిసిన ఆనందంలో స‌ర‌దాగా వుందామ‌ని, చిల్ అవుతూ మాట్లాడుకుందామ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌య‌త్నించాడు. ఓ పాత్రికేయుడు మిమ్మ‌ల్ని గ‌తంలో ఫ్రీగా ప్ర‌శ్న‌లు అడిగే వాడిన‌ని, ఇప్పుడు మీరు స్టార్ అయ్యారు క‌దా ప్రెస్ మీట్లో ప్ర‌శ్న‌లు వేయాలంటే ఇబ్బందిగా వుంద‌న్నాడు. దీనికి విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌దులిస్తూ .. ఎందుకంత ఇబ్బంది.. అస్స‌లు మొహ‌మాట‌ప‌డ‌కండి..చ‌క్క‌గా కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి. క్యాజువ‌ల్ గా ప్ర‌శ్న‌లు అడ‌గండి..నేను కూడా ఫ్రీగా కూర్చుంటా అంటూ కాళ్లు తీసి ముందున్న చిన్న టేబుల్ పై పెట్టి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న‌ట్టుగా వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు.

అయితే దీన్ని త‌ప్పుగా అర్థం చేసుకున్న కొంత మంది నెట్టింట కామెంట్ లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ప్రెస్ మీట్ లో ఇంత యాటిట్యూడ్ చూపించాలా?.. ప‌బ్లిసిటీ కోసం ఇంత అతి చేయాలా? అంటూ కామెంట్ లు చేయ‌డం మొద‌లు పెట్టారు. దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ పీఆర్ టీమ్ వివ‌ర‌ణ ఇచ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌లో యాటిట్యూడ్ పెరిగింద‌ని, త‌ను అలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని షోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ లు చేశార‌ని అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ అక్క‌డున్న వారిని చిల్ చేయ‌డం కోసం చేసిన ప్ర‌య‌త్న‌మే కానీ ఎవ‌రినీ కించ‌ప‌ర‌చాలని, త‌న యాటిట్యూడ్ ని చూపించాల‌ని చేసిన ప్ర‌య‌త్నం కాద‌ని స్ప‌ష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ప్ర‌మోష‌న్స్ కోసం తిరిగినా తెలుగు మీడియాను మిస్స‌వుతున్నాను.

తెలుగు మీడియాతో మాట్లాడితే హ్యాపీగా వుంది. మీ న‌వ్వులు విని చాలా కాల‌మైంది అంటూ తెలుగు మీడియాని ఓన్ చేసుకున్నాడే కానీ ఎక్క‌డా కించ‌ప‌రిచే ప్ర‌య‌త్నం లేద‌ని తెలిపారు. ఈ వీడియోని రీట్వీట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ దీనికి ఆస‌క్తిక‌ర‌మైన ప‌దాల‌ని జోడించ‌డం విశేషం. 'ఎవరైనా తమ రంగంలో ఎదగాలని ప్రయత్నిస్తారు.. వారి వెనుక ఎల్లప్పుడూ లక్ష్యం ఉంటుంది. ఆ ల‌క్ష్యం కోసం మేము పోరాడతాము. మీరు నిజాయితీగా ఉన్నప్పుడు, మీరే ప్రతి ఒక్కరి మంచిని కోరుకున్నప్పుడు - ప్రజల ప్రేమ, దేవుని ప్రేమ మిమ్మల్ని రక్షిస్తుంది. అంటూ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News