టాలీవుడ్ దసరా సినిమాలలో "గాడ్ ఫాదర్" విజేతగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. 'శివ' సెంటిమెంట్ తో బరిలో దిగిన "ది ఘోస్ట్" చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది. కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇక చిన్న సినిమాగా విదుదలై మంచి చిత్రం అనిపించుకున్న "స్వాతిముత్యం".. ఆశ్చర్యకరంగా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేకపోతోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన 'స్వాతిముత్యం' సినిమాని కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ తెరకెక్కించారు. ఇందులో గణేష్ బెల్లంకొండ మరియు వర్షా బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించారు. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా చూసిన చాలా మంది సాధారణ ప్రేక్షకులు కూడా మెచ్చుకున్నారు.
అయితే దీనికి తగ్గట్టుగా వసూళ్ళు లేకపోవడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సరైన సమయంలో విడుదల చేయకపోవడమే ఈ విచిత్ర పరిస్థితికి కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిజానికి 'గాడ్ ఫాదర్' మరియు 'ది ఘోస్ట్' వంటి రెండు పెద్ద సినిమాలు పండగ రేసులో ఉన్నప్పుడు.. 'స్వాతిముత్యం లాంటి చిన్న సినిమాని ఎందుకు విడుదల చేస్తున్నారని అందరూ ఆలోచించారు.
ప్రమోషన్స్ సమయంలో ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ కి ఎక్కువగా ఎదురైన ప్రశ్న కూడా ఇదే. అయితే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్నందున ఇది కూడా పెద్ద సినిమానే అని నిర్మాత పేర్కొన్నాడు. అంతేకాదు 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని మార్నింగ్ షోకి.. 'ఘోస్ట్' ను మ్యాట్నీకి చూసి.. ఆ తర్వాత తమ 'స్వాతిముత్యం' సినిమాని చూస్తారని నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.
చిరంజీవి - నాగార్జున లాంటి ఇద్దరు పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు థియేటర్లలో ఉన్నప్పుడు.. చిన్న సినిమాకి జనాలు వస్తారని అనుకోవడం సాహసమే అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లే 'స్వాతిముత్యం' సినిమాకి మంచి టాక్ వచ్చినా థియేటర్లలో ఫుట్ ఫాల్స్ తక్కువగా ఉన్నాయి.
'గాడ్ ఫాదర్' సినిమాకి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక 'ఘోస్ట్' చిత్రానికి యావరేజ్ టాక్ రావడంతో ఏ దశలోనూ బాక్సాఫీస్ వద్ద నిలవడలేకపోయింది. ఇది చిరంజీవి చిత్రానికి మరింత అడ్వాంటేజ్ గా మారింది. 'స్వాతిముత్యం' సినిమా ఉన్నా పక్కన మెగాస్టార్ మూవీ ఉండటంతో.. జనాల దృష్టి అటు వైపే మళ్లిందని కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది.
'స్వాతిముత్యం' సినిమాకి వచ్చిన రివ్యూలు రేటింగ్స్ ని బట్టి చూస్తే.. పెద్ద సినిమాలేవీ లేని సమయంలో కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసి విడుదల చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దసరా కు వారం ముందుగా లేదా వారం తర్వాత రిలీజ్ చేసినా బాగుండేదని అంటున్నారు. ఫెస్టివల్ సీజన్ క్యాష్ చేసుకోవాలని అనుకోవడంతో మొదటికే మోసం వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇకపోతే 'స్వాతిముత్యం' సినిమాకి ఫుట్ ఫాల్స్ తక్కువగా ఉండటంతో.. ఇప్పుడు ఆ స్క్రీన్స్ ని 'గాడ్ ఫాదర్' చిత్రానికి కేటాయించినట్లు తెలుస్తోంది. 'మంచి సినిమా' అనిపించుకున్న చిత్రానికి ఇలాంటి పరిస్థితి రావడానికి నిర్మాతల అతి విశ్వాసమే కారణమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంత మంచి సినిమా అయినా సరైన తేదీకి విడుదల చేయడం అంతే అవసరమని 'స్వాతిముత్యం' తో మరోసారి రుజువైందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.