విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన పాన్ ఇండియా మూవీ ''విక్రమ్'' రిలీజ్ కు రెడీ అయింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
'విక్రమ్' సినిమాలో కమల్ తో పాటుగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరియ మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారు.
మరో రెండు రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా 'విక్రమ్' నుంచి సూర్య ఇంటెన్స్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. అయితే ఇందులో సూర్య క్యారక్టర్ ఏంటనేది మాత్రం మేకర్స్ వెల్లడించలేదు.
'విక్రమ్' సినిమాలో సూర్య చేసిన అతిధి పాత్ర ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని.. దీనికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి తన దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలిపారు.
తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 'విక్రమ్' చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మిగతా భాషల సంగతి అటుంచితే తెలుగులో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ లేదు.
విక్రమ్ డబ్బింగ్ సినిమా కావడం.. హీరోలు ఇప్పుడు ఫార్మ్ లో లేకపోవడం.. ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం కూడా దీనికి కారణం కావొచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా లేవు. బుక్ మై షోలో అంతా గ్రీన్ గా కనిపిస్తోంది.
మరోవైపు అదే రోజు రిలీజ్ అవుతున్న 'మేజర్' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. రేపు హైదరాబాద్ లో 15 ప్రీమియర్ షోలు ప్లాన్ చేయగా.. ఇప్పటికే అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. దీంతో మరికొన్ని షోలు యాడ్ చేసే పరిస్థితి ఏర్పడింది. మరి దీనికి పోటీగా రాబోతున్న 'విక్రమ్' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
'విక్రమ్' చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హసన్ - ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యువ హీరో నితిన్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ మూవీకి గిరీష్ గంగాధర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.