రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్'. వెర్సటైల్ డైరెక్టర్ గా , హీరో క్యారెక్టర్ లని ప్రత్యేకంగా మలుస్తూ బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న దర్శకుడిగా పేరున్న పూరి జగన్నాథ్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో రూపొందించారు. వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
రిలీజ్ కు ముందు విజయ్ దేవరకొండ రూ. 200 కోట్ల పై చిలుకు వసూళ్లని రాబడుతుందని ఆశించిన ఈ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచి భారీ షాకిచ్చింది. రిలీజ్ కి ముందు భారీ హంగామా చేయడమే కాకుండా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ, బిజినెస్ పరంగానూ భారీ బజ్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ రోజే డిజాస్టర్ టాక్ రావడంతో ఒక్కసారిగా హీరో విజయ్ దేవరకొండని షాక్ కు గురిచేసింది. తొలి షో నుంచే అంచనాలన్నీ తలకిందులు కావడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో భారీ కసరత్తులు చేసి ఎలాగైనా ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ ని దక్కించుకోవాలని ఆశపడిన విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఒక్కసారిగా అడియాశలయ్యాయి. ఒళ్లు హూనం చేసుకుని కఠోరంగా చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోయింది. ఊహించని విధంగా సినిమా డిజాస్టర్ కావడంతో మేకర్స్ తో పాటు ఈ మూవీని ఏరియాల వారిగా రిలీజ్ చేసిన బయ్యర్లకు తీవ్ర నష్టాలని తెచ్చిపెట్టింది.
ఈ మూవీ కారణంగా మేకర్స్ 70 శాతం నష్టపోగా, నైజాం ఏరియాలో రిలీజ్ చేసిన వరంగల్ శ్రీను 60 శాతానికి మించి నష్టాలని చవిచూశాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యల్లో భాగంగా పూరి, ఛార్మీ డబ్బుని డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి ఇస్తున్నారనే వార్తలు మొదలయ్యాయి. ఇదే తరహాలో హీరో విజయ్ దేవరకొండ కూడా తన పారితోషిరంలో రూ. 6 కోట్లు వెనక్కి ఇచ్చేశాడని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది.
విజయ్ దేవరకొండ తన పారితోసికంలో రూ. 6 కోట్లు తిరిగి నిర్మాతలకు ఇచ్చేశాడని జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదని, విజయ్ ఆ పని చేయలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇందులో వున్న నిజం ఎంతో తెలియాలంటే స్వయంగా విజయ్ దేవరకొండ క్లారిటీ ఇవ్వాల్సిందే అని నెటిజన్ లు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.