సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం చేయాలని కోరుతూ ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు ట్విట్టర్ లో సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్న సంగతి తెలిసిందే. బిజెపి ఎంపి సుబ్రమణియన్ స్వామి- కంగనా రనౌత్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఉద్యమానికి ఊపు తెచ్చారు. దివంగత యువహీరో సుశాంత్ కి న్యాయం జరగాలని.. సిబిఐ దర్యాప్తు చేయాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కోరుతూనే ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దురదృష్టకర మరణం బాలీవుడ్ లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది.
తాజాగా # కాండిల్ 4 ఎస్.ఎస్.ఆర్ అనే హ్యాష్ ట్యాగ్ తో మరణించిన ఆత్మ కోసం డిజిటల్ నిరసనను ప్రారంభించారు. ఇందులో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అభిమానులు పాల్గొన్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే ఒక మిలియన్ ట్వీట్ లతో టాప్ ట్రెండింగులో దూసుకెళుతోంది. ఖతార్- అమెరికా - మలేషియా సహా భారతదేశ అభిమానులు కొవ్వొత్తులను వెలిగించి అభిమానం చాటుకున్నారు. సుశాంత్ సింగ్ కేసులో బిజెపి ఎంపి సుబ్రమణియన్ స్వామి నియమించిన న్యాయవాది ఇష్కరన్ సింగ్ భండారి తన ట్విట్టర్ లో లభించిన భారీ మద్దతుకి ఆనందం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ తో పాటు (1.2 మిలియన్ ట్వీట్లు) ఫేస్‌బుక్ .. ఇన్ స్టాలో # కాండిల్ 4 ఉద్యమం ట్రెండింగ్ లో ఉందని .. అన్ని సోషల్ మీడియాల్లోనూ మొత్తం 2 మిలియన్ ట్వీట్లు పోస్ట్ లు ఉన్నాయని తెలిపారు. పీఆర్వోల ప్రచారంతో పనిలేకుండా అంత అభిమానం కురిపించారని కూడా ఆయన అన్నారు. సుశాంత్ సింగ్ ఆత్మకు నివాళి అర్పించడానికి సుబ్రమణియన్ స్వామి- కంగనా రనౌత్- అంకితా లోఖండే- శేఖర్ సుమన్- అధ్యాయన్ సుమన్ సహా పలువురు ప్రముఖులు కొవ్వొత్తి వెలిగించారు.