డిజిట‌లైజేష‌న్.. పిల‌్లల క్రియేటివిటీకి ముప్పే?

Update: 2015-11-18 17:30 GMT
డిజిట‌లైజేష‌న్ లేనిదే భ‌విష్య‌త్ ప్ర‌పంచాన్ని ఊహించ‌లేం. అప్పుడే పుట్టిన బిడ్డ‌డు సైతం ఐఫోన్ మీద చెయ్యేసే ప‌రిస్థితి. అయితే ఇలాంటి అడ్వాన్స్ మెంట్ వ‌ల్ల పిల్ల‌ల‌కు న‌ష్టం క‌లుగుతోందా?  లాభ‌మా?  డిజిట‌లైజేష‌న్ వ‌ల్ల క్రియేటివిటీ పెరుగుతుందా?  పెర‌గ‌దా? ఇలాంటి ఆస‌క్తిక‌ర డిస్క‌ష‌న్ నిన్న‌టిరోజున హైద‌రాబాద్ అంత‌ర్జాతీయ బాల‌ల చ‌ల‌న‌చిత్రోత్స‌వంలో సాగింది. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలివి..

*ఒక‌ప్పుడు స్కూలుకెళ్లాలంటే బ్యాగు నిండా పుస్త‌కాలు వేసుకుని మోయాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఒకే ఒక్క ట్యాబ్ ప‌ట్టుకుని స్కూలుకెళ్లిపోవ‌చ్చు. అయితే ఎక్కాల పుస్త‌కంతో ప‌నిలేకుండా ప్ర‌తిదానికీ కాలిక్యులేట‌ర్‌ పై ఆధార‌ప‌డితే ప‌రిస్థితేంటి? ఎక్కాలు - గుణింతాలు రాక‌పోవ‌డం అడ్వాన్స్‌ మెంటా? త‌ల్లిదండ్రులే ఆలోచించుకోవాలి.

* మొబైల్ ఫోన్ చేతికివ్వ‌డం వ‌ల్ల ప్ర‌పంచం మొత్తం పిల్ల‌ల చేతిలోకి వ‌చ్చేస్తోంది. భార‌త‌దేశం - చైనాలో జ‌నాభా ఎక్కువ‌. అంత‌కుమించిన జ‌నం యూట్యూబ్‌ లో ఉంటున్నారు. పిల్ల‌ల‌కు యూ ట్యూబ్ విజ్ఞానాన్ని పెంచాలి. త‌ప్పుడు దారుల్ని చూపించ‌కూడ‌దు. కానీ ఇది ఆప‌డం సాధ్య‌మా?

*పిల్ల‌లు ఆట‌లు ఆడితే వ్యాయామం చేసిన‌ట్టు. అవి కూడా ఔట్‌ డోర్ గేమ్స్ ఆడాలి. కానీ ఆ స్థానాన్ని మొబైల్ గేమ్స్ ఆక్యుపై చేశాయి. దీనివ‌ల్ల మాన‌సికానందాన్ని కోల్పోయి లైఫ్‌ ని బ్యాలెన్స్ చేయ‌లేక ఒత్తిడి పాల‌వుతున్నారు. ఇదంతా డిజిట‌ల్ విప్ల‌వం తెచ్చిన ముప్పు.

* ఒక‌ప్పుడు క‌థ‌లు వినాలంటే భామ్మ‌గారో, తాత‌గారో చెప్పాల్సొచ్చేది. కానీ ఇప్పుడు అంత‌ర్జాలం చెబుతోంది. అన్నీ అక్క‌డే దొరికేస్తున్నాయి. కానీ ఆర్టిఫిషియ‌ల్ లైఫ్‌ కి అల‌వాటు ప‌డిపోతున్నారు పిల్ల‌లు. ఇన్నిర‌కాలు ముప్పులున్నాయి. అయితే డిజిట‌ల్ టెక్నాల‌జీని ఎంత‌కు ప‌రిమితం చేస్తే మంచిదో త‌ల్లిదండ్రులే పిల్ల‌ల‌కు నేర్పాలి. అలా నేర్ప‌క‌పోతే భ‌విష్య‌త్ ప్ర‌పంచానికి వినాశ‌నం త‌ప్ప‌దు. అదీ మ్యాట‌రు.

Tags:    

Similar News