సినిమాలు చేస్తూ ఉండడం వేరు.. అవకాశాలను అందిపుచ్చుకోవడం వేరు. ఇండస్ట్రీలో సెటిల్ అయేందుకు చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ జోరు కొనసాగించాలంటే మాత్రం వరుసగా సినిమాలు చేయాల్సిందే. భారీ సినిమాలు చేస్తే వచ్చే క్రేజ్ వేరు.. అలాగని పెద్ద సినిమాల ఆఫర్స్ లేవని చేతులు ముడుచుకుని కూర్చోకూడదని చాటి చెబుతోంది తాప్సీ.
ఒకవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్.. మరోవైపు కమర్షియల్ సినిమాలు.. ఇంకోవైపు కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకుంటోంది. సౌత్ లో చేసిన పొరపాట్లు చేయకూడదని అనుకుంటోందో ఏమో చెప్పలేం కానీ.. ఇప్పుడు తాప్సీ సినిమాలు వరుసగా విడుదల అవుతూనే ఉంటున్నాయి. ఎలాంటి చడీచప్పుడు లేకుండానే మూవీస్ ఫినిష్ చేస్తోందంటే ఈ భామ స్ట్రాటజీ అర్ధమవుతుంది. ఇప్పుడు దిల్ జంగ్లీ అనే సినిమాను రిలీజ్ కి రెడీ చేసేసింది తాప్సీ. ఫిబ్రవరిలో ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించేశారు కూడా. నిన్నే టీజర్ పోస్టర్ విడుదల చేయగా.. ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేశారు.
పూజా ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదల అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ లో డిఫరెంట్ గెటప్ తో తాప్సీ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో పాగా వేసేందుకు ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను అప్లై చేస్తున్న వ్యూహాలను చూసి పలువురు ఆశ్చర్యపోవడమే కాదు.. స్ఫూర్తి పొందుతున్నారు కూడా.
Full View