ముందు మేం చెప్పాం.. కాదు మేం చెప్పాం

Update: 2017-12-08 07:53 GMT
టాలీవుడ్ లో సినిమాల అసలు బాక్స్ ఆఫీస్ వార్ చూసి చాలా కాలమే అవుతోంది. మొన్నటి వరకు చిన్న సినిమాలు అలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ఇక నాని - అఖిల్ వార్ తో బాక్స్ ఆఫీస్ చాలా హీటెక్కనుందనే టాక్ వినిపిస్తోంది.  రెండు సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా నాని సినిమా మార్కెట్ కొంచెం ఎక్కువగా ఉండడంతో అందరి చూపు ఎక్కువగా MCA సినిమాపైనే ఉంది. ఇక అఖిల్ కూడా తన స్థాయి వరకు బాగానే అంచనాలను రేపుతున్నాడు. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా గట్టి పోటీని ఇవ్వగలదని సినీ పండితులు చెబుతున్నారు.

మొదట నాని MCA డిసెంబర్ 21వ తేదీన రాబోతోంది. ఇక అఖిల్ హలో మాత్రం 22వ తేదీకి రానుంది. అయితే మొదట ఈ సినిమాలు రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ చాలానే నడిచింది. కానీ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఏ మాత్రం తగ్గకుండా సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ఓ రకంగా ఫైట్ కి సిద్ధమయ్యారు. కానీ బయట మాత్రం రెండు సినిమాలకు మంచి టాక్ ఉందని తప్పకుండా అడతాయని చెబుతున్నారు. ఈ విషయంలో అసలు పాయింట్ కి వస్తే దిల్ రాజు - నాగార్జున.. ముందు మేం చెప్పాం.. కాదు మేం చెప్పాం అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు.

ముందుగా నాగార్జున మాట్లాడుతూ.. మేము సెప్టెంబర్ లొనే హలో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశాం. డిసెంబర్ లొనే సినిమాని ఎలాగైనా రిలీజ్ చేయాలని ముందునుంచి అనుకుంటున్నదే. అంతే కాకుండా నానితో ఏం ప్రాబ్లమ్ లేదు. పోటీ ఉండదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఫోర్ డేస్ హాలిడేస్ ఉన్నాయి అండ్ న్యూ ఇయర్ కూడా వస్తోంది. పైగా థియేటర్స్ కూడా సరిపోతాయి కాబట్టి రెండు సినిమాలు సమానంగా సక్సెస్ అవుతాయనే విధంగా నాగ్ వివరించారు.

రీసెంట్ గా దిల్ రాజు మాట్లాడుతూ.. ఆగస్ట్ లొనే మేము సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశాం. ఆ తర్వాత 15కి కి మారుద్దామని అనుకున్నా ఫైనల్ గా అదే డేట్ ఫిక్స్ అయ్యిందని చెబుతూ.. నాని - అఖిల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు అనే నమ్మకం ఉందని చెప్పారు.

అంటే ఎవరికి వారు ఇలా మేం చెప్పాం అంటూ మేం చెప్పాం అని ఒకే డేటుకి లాకయ్యారు అనమాట. బాగానే ఉంది. కాకపోతే కంటెంట్ ఉంటేనే జనాలు ఈ సినిమాలకు 'కాదు మేం చెప్పాం' అన్న తరహాలో విక్టరీని కట్టిపెట్టేది. చూద్దాం ఏమవుతుందో!!
Tags:    

Similar News