పది హిట్లు ఉన్నా.. ఒక్క ఫ్లాప్ ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆ ఒక్క ఫ్లాప్ మార్కెట్ వర్గాల్లో బోలెడన్ని ప్రకంపనాలకు కారణమవుతుంది. తమ ప్రొడక్ట్ లో నాణ్యతాపరమైన ప్రమాణాల్లో లోపాల్ని ఎత్తి చూపిస్తుంది. అందునా క్రియేటివ్ ఫీల్డ్ లో ప్రతిదీ జనాల్ని మెప్పించేదిగా ఉండాలి. పైగా మునుపెన్నడూ చూడనంత కొత్తగా - క్రియేటివ్ గా కనిపించాలి.
ఇలాంటి విషయాల్లో నిర్మాత దిల్ రాజును తక్కువ చేసి మాట్లాడలేం! ఆయన్ని గోల్డెన్ హ్యాండ్ అని పొగిడేస్తుంది చిత్రపరిశ్రమ. అతడు చేపట్టిందల్లా బంగారమేనన్న నానుడి బలపడిపోయింది. 2017లో ఏకంగా ఆరు హిట్లు పడడంతో ఇక ఎదురేలేనివాడిగా మార్కెట్లో పాపులరయ్యారు. అయితే ఆ పాపులారిటీ అంతా ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్టు.. `శ్రీనివాస కళ్యాణం` డిజాస్టర్ తో అంతా తుడిచిపెట్టుకుపోయింది. అయితే పరిశ్రమలో గెలుపోటములు సహజం. అన్నిటినీ తట్టుకుని నిలబడినవాడే మొనగాడు ఇక్కడ. ఈ విషయంలో దిల్ రాజుకు ఉన్న అనుభవం ఎంతో గొప్పది. ఆయన మొక్కవోని ధీక్ష ముందు పరాజయాలే తలవొంచాయి. అందుకే ఈసారి ఆ కాంపౌండ్ నుంచి వస్తున్న `హలో గురూ ప్రేమకోసమే` చిత్రంపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు.
`శ్రీనివాస కళ్యాణం` తర్వాత వస్తున్న ఈ సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇటు దిల్ రాజుకు - అటు హీరో రామ్ కి ఓ బ్లాక్ బస్టర్ పడాల్సిన సన్నివేశం ఉంది. ఆ మేరకు రాజుగారిపైనే తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇటీవలి కాలంలో రొటీన్ గా ఉంటే తిరస్కరిస్తున్న ఆడియెన్ మరో రొటీన్ సినిమా చూస్తారా? అన్నది చెప్పలేం. త్రినాథరావు నక్కిన ఈ సినిమాలో రొటీనిటీకి మించి ఏం క్రియేటివిటీ చూపిస్తున్నారు? అన్నది డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది. సినిమా చూపిస్త మావ - నేను లోకల్ చిత్రాలు పేరుకు హిట్టయినా - క్రిటిక్స్ ప్రశంసలు మాత్రం శూన్యం. అందుకే ఇప్పుడు రామ్ సినిమాపైనా అనుమానాలు ముసురుకున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 18న `హలో గురు ప్రేమకోసమే` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. మునుముందు టీజర్లు - ట్రైలర్లలో కొత్తదనం జనాల్ని ఆకర్షించాలి. లేదంటే రొటీనిటీ ప్రభావం నెగెటివ్ ప్రభావం చూపించడం ఖాయం. ఆ మేరకు రాజావారు జాగ్రత్తలు తీసుకుంటారనే భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో అగ్రనిర్మాణ సంస్థలన్నీ రీషూట్లు - రీచెకింగ్ లు అంటూ చాలానే చేస్తున్నాయి. దిల్ రాజు ఇలాంటి విషయాల్లో తెలివైన ప్రణాళికలతోనే ఉంటున్నారు కాబట్టి.. ఈసారి రామ్ కోసం ఏం చేస్తారో చూడాలి.