దిల్ రాజు సమ్మర్ రేసులోకి వచ్చేశాడు

Update: 2016-02-11 17:30 GMT
నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆచితూచి అడుగులేస్తుంటాడు దిల్ రాజు. ఏ సినిమా పడితే ఆ సినిమా ఎంచుకోడు ఆయన. గత ఏడాది రాజు నైజాం ఏరియాకు ‘బాహుబలి’ మీద రూ.24 కోట్ల పెట్టుబడి పెట్టినపుడు అతను చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడనుకున్నారు. కానీ బాహుబలి ప్రభంజనాన్ని ముందే ఊహించి ఆ రేటు పెట్టిన రాజు భారీగా లాభాలందుకున్నాడు. తర్వాత పటాస్ లాంటి మీడియం రేంజి మూవీ.. సినిమా చూపిస్త మావ - కుమారి 21 ఎఫ్ లాంటి చిన్న సినిమాలు కూడా ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది సంక్రాంతికి డిక్టేటర్ - ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి సినిమాలపై పెట్టుబడి పెట్టి మంచి ఫలితాన్నే అందుకున్నాడు రాజు.

సంక్రాంతి తర్వాత రాబోయే అతి పెద్ద సీజన్ అయిన వేసవిలోనూ రాజు రెండు ఆసక్తికర చిత్రాల్ని నైజాంలో రిలీజ్ చేయబోతున్నాడు. అందులో వేసవి సందడికి తెర తీయబోతున్న ‘ఊపిరి’ ఒకటి. ‘సోగ్గాడే చిన్నినాయనా’తో నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన నేపథ్యంలో ‘ఊపిరి’ మీద అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రాజు ఈ సినిమా నైజాం రైట్స్ తీసుకున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పీవీపీ సినిమాతోనే మరో భారీ సినిమాకు కూడా డీల్ కుదుర్చుకున్నాడు రాజు. ఆ సినిమా మరేదో కాదు.. బ్రహ్మోత్సవం. ఏప్రిల్ నెలాఖర్లో రాబోతున్న ఈ చిత్రానికి నైజాం ఏరియాకు రికార్డు రేటు పెట్టాడట రాజు. తమ సంస్థలో తెరకెక్కుతున్న రెండూ సినిమాల నైజాం రైట్సూ తీసుకోవడంతో కొంత డిస్కౌంట్ కూడా ఇచ్చిందట పీవీపీ సంస్థ.
Tags:    

Similar News