స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు కథల జడ్జిమెంట్ విషయంలోనే కాకుండా బిజినెస్ స్కిల్స్ విషయంలో కూడా మహా ఘటికుడని పేరు. అలాంటిది ఆయన రాశి ఖన్నాకు - ఆమె మేనేజర్ కు ఓ దండం బాబోయ్ అంటున్నాడు. ఎందుకు?
దిల్ రాజు మాటల్లోనే విందాం " అన్నిటికంటే నాకు బాగా నచ్చిన విషయం ఇది.. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను.. కథ విని ఒకే అన్నది రాశి.. రెమ్యునరేషన్ ఫైనల్ చేసే దశలో తన మానేజర్ ని ఆఫీస్ లో కూర్చోబెట్టి ఈ సినిమా తన చేయి జారకూడదు అని ఇన్ స్ట్రక్షన్ ఇచ్చింది. 'నేను ఆ సినిమా చేయాలి. ఎలాగైనా చేయాలి' అని డిసైడ్ అయ్యింది. మరి ఇంత బాగా కథ నచ్చినప్పుడు రెమ్యునరేషన్ తగ్గించొచ్చు కదా అని మేనేజర్ ను అడిగితే కాదు 'సార్.. బాగోదు సర్ వేరే సినిమాలకు అలానే తీసుకుంటాం సర్' అనే వాడు. మరి సినిమా నచ్చింది కదా తగ్గించొచ్చు కదా అంటే మాత్రం ఒప్పుకోలేదు. రాశి ఫోన్ చేసి 'నేను ఈ సినిమా చెయ్యాలి. నేను ఈ సినిమా ఎలాగైనా చెయ్యాలి అని నాకు చెప్పింది. అంటే అది తనకున్న ప్యాషన్.. కథ నచ్చిన తర్వాత దాన్ని ఎలాగైనా వదిలిపెట్టకుండా చేయాలని ఒక తపన.. సినిమా పట్ల ఉన్న ప్రేమ. రాశీ.. నీ మేనేజర్ అగ్రిమెంట్ చేసేవరకూ మాకు టార్చర్ చూపించాడు. ఇట్స్ ఏ గుడ్ థింగ్. నువ్వు ఈరోజు మూవీ చూసి ఇలా ఎమోషనల్ అయ్యవంటే ఇట్స్ రియల్లీ ఎ గుడ్ జర్నీ. ఇందాక మన టీమ్ మెంబర్స్ అందరూ నీ డెడికేషన్ - హార్డ్ వర్క్ - పెర్ఫార్మెన్స్ గురించి చెబుతున్నారు. రోజు రోజుకీ నీ నటన చాలా మెరుగవుతోంది. 'తొలి ప్రేమ'కు ఈ సినిమాకు కూడా వేరియేషన్ చూపించావు."
సినిమా చూసిన తర్వాత రాశి చాలా ఎమోషనల్ అయిపోయిందట. నితిన్ మాట్లాడుతూ "సినిమా నుండి బయటకు వచ్చిన తర్వాత రాశి ఏడుస్తూనే ఉంది.. ఏడుస్తూనే ఉంది" అన్నాడు. మరో వైపు రాశి మాట్లాడుతూ "నేను సినిమా అయిన తర్వాత సతీష్ గారి కాళ్ళకి దండం పెట్టాను. ఇంతవరకూ నేను అలా ఏ డైరెక్టర్ కాళ్ళని టచ్ చేయలేదు. కథ విన్నప్పుడు కూడా నాకు చాలా నచ్చింది. దిల్ రాజు గారు ఇందాక చెప్పినట్టు కథ చెప్పడం వేరు.. కానీ అది సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడం వేరు. ఈ సినిమా అందరి మనసులని - చిన్న పిల్లలనుండి పెద్దవాళ్ళ వరకూ అందరినీ టచ్ చేస్తుంది. ఈ సినిమాలో భాగం అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది."