టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను తెలుగు ప్రేక్షకులకు ఇచ్చాడు. నిర్మాతగా - డిస్ట్రిబ్యూటర్ గా భారీ లాభాలను దక్కించుకున్న దిల్ రాజు తాజాగా 'మహర్షి' చిత్రంను నిర్మించాడు. మహేష్ బాబు 25వ చిత్రం అవ్వడంతో ఈ చిత్రంను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని అశ్వినీదత్ - పీవీపీలతో కలిసి నిర్మించాడు. అయితే ఈ చిత్ర నిర్మాణ బాధ్యత మొత్తం దిల్ రాజు చూసుకున్నాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ చిత్రం సక్సెస్ ఆయనకు విపరీతమైన సంతోషంను కలిగిస్తుందని ఆయన మాటల్లో అర్థం అవుతోంది.
ఒక గొప్ప నిర్మాత అయిన అశ్వినీదత్ గారితో కలిసి ఈ చిత్రంను నిర్మించడం తనకు ఎంతో ఆనందంను మిగిల్చిందని దిల్ రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంను కొనుగోలు చేసిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇలాంటి సినిమాను తమకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నారు. భరత్ అనే నేను చిత్రం ఫైనల్ కలెక్షన్స్ ఎంత అయితే వచ్చాయో అంత అమౌంట్ ను నేను ఇవ్వమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పారు. వారు సంతోషంగా ఓకే చెప్పారు.
ఇలాంటి సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చినందుకు వారు నా నుండి హగ్ కోరుకుంటున్నారు. నాకు హగ్ ఇచ్చి మరీ కృతజ్ఞతలు చెబుతుంటే వారు ఏ మేరకు ఈ చిత్రం వల్ల ఆనందంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రంతో లాభాలు దక్కించుకోబోతున్నట్లుగా దిల్ రాజు ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే 40 కోట్ల షేర్ క్రాస్ చేసిన ఈ చిత్రం పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో పాటు, వచ్చిన టాక్ తో 100 కోట్లను దక్కించుకోవడం ఖాయంగా యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.