బాడీ హగ్గింగ్ ఫ్రాక్‌లో గుబులు రేపుతున్న మిల్కీ
ముఖ్యంగా డిజిటల్ మీడియా యుగంలో నిరంతర ఫోటోషూట్లతో లైమ్ లైట్ లో ఎలా ఉండాలో తమన్నాకు స్పష్ఠంగా తెలుసు.
నేటితరం నాయికలతో పోటీపడాలంటే కేవలం నట ప్రతిభ ఉంటే సరిపోదు. వేషం, భాష, గ్లామర్, డ్యాన్సులు, యాక్షన్, సోషల్ మీడియాలో దూసుకుపోయే తత్వం .. ఇంకా చాలా కావాలి. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసేందుకు సీనియర్ బ్యూటీ తమన్నా చాలా తపిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ మీడియా యుగంలో నిరంతర ఫోటోషూట్లతో లైమ్ లైట్ లో ఎలా ఉండాలో తమన్నాకు స్పష్ఠంగా తెలుసు.
తమన్నా తాజా ఫోటోషూట్ అగ్గి రాజేస్తోంది. బ్లాక్ కలర్ బాడీ హగ్గింగ్ ఫ్రాక్ లో తమన్నా ఫోజులు మతులు చెడగొడుతున్నాయి. హీల్స్ సహా టాప్ టు బాటమ్ టోటల్ బ్లాక్ లో కనిపించిన తమన్నా మిల్కీ వైట్ సొగసు మరింత హైలైట్ అయింది. అలాగే ఈసారి హెయిర్ కట్ లో మార్పు.. తలకు రబ్బర్ బ్యాండ్ తో టూ యంగ్ గా మారిపోయింది కూడా. 34 వయసులో పెళ్లికి సిద్ధమవుతోందన్న ప్రచారం నడుమ ఈ యంగ్ టీనేజర్ లుక్ మరింతగా చర్చల్లోకొస్తోంది.
ఓవైపు తమన్నా- విజయ్ వర్మ జోడీ పెళ్లి కబుర్లు.. మరోవైపు తమన్నా ఫోటోషూట్ల దూకుడు ప్రస్తుతం వెబ్ ని హీటెక్కిస్తోంది. పెళ్లి కోసం సిద్ధమవుతున్న ఈ అందమైన జంట ఇప్పటికే ముంబైలో సీఫేసింగ్ అపార్ట్ మెంట్ ని వెతుకుతున్నారని కథనాలొచ్చాయి. వ్యక్తిగత జీవితంలో సెటిలవ్వాలన్న ఆలోచన బావుంది. ఆర్జన కంటే ఫ్యామిలీ లైఫ్ ఆవశ్యకతపై మిల్కీ పూర్తి స్పష్ఠతతో ఉంది. పెళ్లి తర్వాతా నటనా కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదుగనుక విజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని కూడా టాక్ వినిపిస్తోంది.
కెరీర్ పరంగా చూస్తే.. విజయ్ వర్మతో కలిసి కొన్ని వెబ్ సిరీస్ లలో నటించింది. అదే క్రమంలో స్నేహం ప్రేమగా మారింది. 2024లో స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ లో ప్రత్యేక గీతంలో కనిపించిన తమన్నా తదుపరి `వేద` అనే చిత్రంలో నటిస్తోంది. నీరజ్ పాండే సిరీస్ సికందర్ కా ముఖద్దర్ లోను కీలక పాత్రలో నటిస్తోంది. ఓదెలా 2 చిత్రీకరణ దశలో ఉంది.