ఆయన బ్యాడ్ సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ అయిందా!
ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి సక్సెస్ లు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంత వరకూ ఆయనకు ఫెయిల్యూర్ అనేదే లేదు.
ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి సక్సెస్ లు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంత వరకూ ఆయనకు ఫెయిల్యూర్ అనేదే లేదు. ఆ పదం అంటేనే ఆయనకు తెలియదు. తొలి సినిమా `స్టూడెంట్ నెంబర్ వన్` నుంచి `ఆర్ ఆర్ ఆర్` వరకూ అన్నీ బ్లాక్ బస్టర్లే. పాన్ ఇండియాలో ఆయన సక్సెస్ లు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన క్రేజ్ పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ కే చేరింది. జక్కన్న దర్శకత్వంలో నటించాలని ఎంతో మంది స్టార్ హీరోలు క్యూ లో ఉన్నారు.
ఇలా రాజమౌళి కీర్తి ప్రపంచ వ్యాప్తంగా చేరింది. కానీ ఆయన సినిమాలో పని చేసిన హీరో తర్వాత సినిమా తో ప్లాప్ అందుకుంటాడు? అనే ఓ బ్యాడ్ సెంట్ మెంట్ ఉంది. కానీ `దేవర` విజయంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాన్ని జయించాడు. కానీ `దేవర` సినిమాపై నెగిటివిటీ ఏ రేంజ్ లో స్ప్రెడ్ అయిందో తెలిసిందే. వసూళ్ల పరంగా నెంబర్ కనిపిస్తుంది తప్ప! సినిమా బాగుందని చెప్పిన జనాలు తక్కువే. దీంతో సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. సినిమా సాధించిన వసూళ్లు ఆధారంగా రాజమౌళి బ్యాడ్ సెంట్ మెంట్ ని తారక్ బీట్ చేసినట్లు అయింది.
తాజాగా రాజమౌళి బ్యాడ్ సెంట్ మెంట్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ విషయంలోనూ ప్రూవ్ అయింది. ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్ ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ అయిన వార్నర్ వైపు బిడ్డర్ లు చూడలేదు. వార్నర్ బేస్ ధర 2 కోట్లు కంటే చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు. ఇక్కడే జక్కన్న సెంటిమెంట్ వెంటాడుతుంది.
2024 ఏప్రిల్ లో రాజమౌళి-వార్నర్ కలిసి ఓ యాడ్ లో నటించారు. ఆ యాడ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. కట్ చేస్తే 2024 నవంబర్ ఐపీఎల్ వేలంలో వార్నర్ ని ఎవరూ కొనలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆయన లెగ్ మహిమ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే వార్నర్ కారణంగా పుష్ప సినిమాలో పాటలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనమయ్యాయో కూడా తెలిసిందే. పుష్ప పాటలపై వార్నర్ రీల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి.