ఫ్యామిలీకి స్టార్ హీరో ఎమోషనల్ వీడ్కోలు
ఇటీవల కుటుంబంతో కలిసి సింగపూర్‌కి హాలీడేకి వెళ్లిన అజిత్ తిరిగి వచ్చి వెంటనే దుబాయ్‌కి వెళ్లారు. దుబాయికి వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులకు ఎమోషనల్‌గా వీడ్కోలు పలికారు.
తమిళ్ స్టార్ హీరో అజిత్ ఈ సంక్రాంతికి మొదట 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో వస్తాడనే ప్రచారం జరిగింది. కానీ మైత్రి మూవీ మేకర్స్ సినిమా విడుదల షూటింగ్ పూర్తి కాలేదని, సమ్మర్‌లో విడుదల చేస్తామంటూ ప్రకటించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా పొంగల్ రేసు నుంచి తప్పుకోవడంతో అజిత్ మరో సినిమా అయిన 'విదాముయార్చి' సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మేకర్స్ నుంచి షాకింగ్ ప్రకటన వెలువడింది. విదాముయార్చి సినిమాను సైతం కొన్ని కారణాల వల్ల పొంగల్‌కి విడుదల చేయడం లేదు అంటూ ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్‌తో ఉన్న వివాదం కారణంగా వాయిదా వేస్తున్నారనే వార్తలు వచ్చాయి.
విదాముయార్చి సినిమా వాయిదాకు కారణం ఏంటి అనే విషయాన్ని అధికారికంగా వెళ్లడించలేదు. కానీ జనవరి చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఫ్యాన్స్ ఒక వైపు విదాముయార్చి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటే హీరో అజిత్ మాత్రం సినిమాను ముగించి దుబాయ్ లో జరగబోతున్న అతి పెద్ద రేసింగ్ కాంపిటీషన్‌కి వెళ్లారు. 24 గంటల రేసులో అజిత్ పాల్గొనబోతున్నాడు. అతడు తన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. గతంలో ఎన్నో రేసింగ్ కాంపిటీషన్‌లో పాల్గొన్న అజిత్‌కి ఆయన టీంకి ఇది అత్యంత కీలకమైన రేసింగ్ కాబోతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
ఇటీవల కుటుంబంతో కలిసి సింగపూర్‌కి హాలీడేకి వెళ్లిన అజిత్ తిరిగి వచ్చి వెంటనే దుబాయ్‌కి వెళ్లారు. దుబాయికి వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులకు ఎమోషనల్‌గా వీడ్కోలు పలికారు. పెద్ద ఎత్తున అక్కడకు వచ్చిన అభిమానులకు సైతం అజిత్ కాస్త ఎమోషనల్‌గా వీడ్కోలు పలకడం అందరి దృష్టిని ఆకర్షించింది. అతి పెద్ద రేసింగ్ ఈవెంట్‌కి హాజరు కాబోతున్న నేపథ్యంలో అజిత్ ఇలా ఎమోషనల్ అయ్యారు అంటూ మీడియాలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ ఈ రేసింగ్‌లో భారీ విజయాన్ని సాధించాలని అభిమానులు కోరుకుంటూ ఘనంగా వీడ్కోలు పలికారు.
అజిత్ హీరోగా నటించడం కంటే లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, రేసింగ్‌లకు హాజరు కావడంను ఇష్టపడుతాడు. కెరీర్ ఆరంభం నుంచి ఆయన రేసింగ్‌లపై ఆసక్తితో ఎక్కువ శాతం తన సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో రేస్ ఉండేలా ప్లాన్ చేస్తారు. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఆయన రియల్ స్టంట్స్ చేస్తూ, రేసింగ్‌లో, బైక్ రైడింగ్‌లో గాయాల పాలు అయిన విషయం తెల్సిందే. తాజాగా ఆయన నటించిన రెండు సినిమాల్లోనూ ఏదో ఒక యాక్షన్ సన్నివేశంలో రేసింగ్ సన్నివేశం లేదా భారీ ఛేజింగ్ సన్నివేశం ఉండటం మనం చూడబోతున్నాం. సాధారణంగా అంతటి క్రేజ్ ఉన్న హీరోలు ఎవరూ అలాంటి రేసింగ్‌లకు ఆసక్తి చూపించరు. కానీ అజిత్ మాత్రమే రియల్ స్టంట్స్‌ని ఇష్టపడుతారు. అందుకే రేసింగ్‌ల్లోనూ పాల్గొంటూ ఉంటాడు.