పండోరా గ్రహంపై కీర్తి సురేష్ హనీమూన్
ఇంతలోనే కీర్తి న్యూఇయర్ సెలబ్రేషన్ కం హనీమూన్ ట్రిప్ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. కీర్తి సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ని బట్టి థాయ్‌లాండ్ వెళ్లినట్టు అర్థమవుతోంది.
మహానటి కీర్తి సురేష్ ప్రేమించిన సఖుడు ఆంటోనీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. దుబాయ్ కేంద్రంగా పలు దేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ప్రముఖ బిజినెస్ మేన్ ఆంటోని తట్టిల్ కి కీర్తి చాలా కాలంగా స్నేహితురాలు. ఈ జంట కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. చివరికి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లితో కీర్తి లైఫ్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. కీర్తి పెళ్లి తర్వాత నటిస్తుందా లేదా? అన్నదానిపై ఇంకా స్పష్ఠత లేదు.
ప్రస్తుతానికి కీర్తి సురేష్ హనీమూన్ కోసం ఎక్కడ ప్లాన్ చేసింది? అంటూ అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. కొత్త సంవత్సర వేడుకల కోసం కీర్తి ఒక ఎగ్జోటిక్ లొకేషన్ కి వెళ్లింది. ఇదే లొకేషన్ కీర్తి- ఆంటోని జంటకు హనీమూన్ డెస్టినేషన్ అయిందా? అంటూ ఆరాలు కొనసాగుతున్నాయి. అయితే ఇది గోవానా? లేక ఇంకేదైనా విదేశీ డెస్టినేషన్ అయ్యుండొచ్చా? అంటూ అభిమానులు డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.
ఇంతలోనే కీర్తి న్యూఇయర్ సెలబ్రేషన్ కం హనీమూన్ ట్రిప్ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. కీర్తి సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ని బట్టి థాయ్‌లాండ్ వెళ్లినట్టు అర్థమవుతోంది. భర్తతో కలిసి కొత్త సంవత్సరాన్ని ఎగ్జోటిక్ బీచ్ లొకేషన్ లో సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలో కొన్ని ఫోటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోగ్రాఫ్స్ చూశాక కీర్తి అద్భుతమైన పండోరా(అవతార్ సినిమాలో ఉంది) లాంటి గ్రహంపై హనీమూన్ ప్లాన్ చేసిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. కీర్తి థాయ్ బీచ్ లో సుందరమైన సముద్ర తీరాన ఫుల్ గా చిల్ చేసింది. సముద్రంలో కయాకింగ్ కూడా చేసింది. ప్రస్తుతం బీచ్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
గత డిసెంబర్ 24న గోవాలో బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని మ్యారేజ్ చేసుకున్న కీర్తి, హిందూ- క్రిస్టియన్ స్టైల్ లో పెళ్లి చేసుకోవడం ఆసక్తిని కలిగించింది. కీర్తి పెళ్లి నుంచి చాలా ఫోటోలు వీడియోలు ఇప్పటికే వెబ్ లో వైరల్ అయ్యాయి. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే కీర్తి తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.