మోడ‌ల్ కం న‌టి బ‌మ్ డిగ్గీ డిగ్గీ బ‌మ్

ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా ఫిట్నెస్ ఫ్రీక్ గా సాక్షికి అరుదైన రికార్డు ఉంది.

Update: 2024-11-28 04:10 GMT

కార్తీక్ ఆర్యన్ 'సోను కే టిటు కి స్వీటీ'లో 'బ‌మ్ డిగ్గీ డిగ్గీ బ‌మ్' పాట యూత్ ని క‌ట్టి ప‌డేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌లో యువ మోడ‌ల్ కం న‌టి సాక్షి మాలిక్ అంద‌చందాలు క‌వ్వింత‌కు ఫిదా కానివాళ్లు లేరు. అర్మాన్ మాలిక్ 'వెహం' మ్యూజిక్ వీడియోలోను మాలిక్ ప్ర‌తిభ‌కు గుర్తింపు ద‌క్కింది. ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా ఫిట్నెస్ ఫ్రీక్ గా సాక్షికి అరుదైన రికార్డు ఉంది.

సాక్షి సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది. ఈ భామ షేర్ చేసిన తాజా లుక్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. బ్లాక్ గౌన్ లో సాక్షి భంగిమ‌లు హీటెక్కిస్తున్నాయి. ఈ గౌన్ డిజైన్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ . ఎంపిక చేసిన డిజైన‌ర్ గౌన్ థై హై ఎలివేష‌న్ తో అత్యంత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. సాక్షి బోల్డ్ మోడ‌ల్.. న‌టిగా రాణిస్తోంది. మునుముందు తెలుగు చిత్ర‌సీమ‌లోను అవ‌కాశాలు అందుకుంటుందేమో చూడాలి.

సాక్షి మాలిక్ .. సినిమాల్లో న‌టిస్తూనే బ్రాండ్ల‌కు మోడ‌లింగ్ చేస్తోంది. టీవీ క‌మ‌ర్షియ‌ల్స్ తో ఆరంభం ఆడియెన్ కి చేరువైంది. త‌ర్వాత సినీరంగంపై దృష్టి సారించింది. సౌత్, నార్త్ ఎక్క‌డైనా పెద్ద‌ క‌థానాయిక‌గా వెలిగిపోవాల‌ని క‌లలు గంటోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వెతికేస్తున్న ఈ భామకు ఇంకా టాలీవుడ్ గేట్స్ తెరుచుకోవాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఇన్ స్టా వేదిక‌గా చెల‌రేగుతున్న‌ సాక్షి యూట్యూబ్ చానెల్లో ఫిట్నెస్ క్లాసుల‌తోను ఆక‌ట్టుకుంటోంది.

 

Tags:    

Similar News