పిక్‌టాక్ : ఈమె అందాల ఐశ్వర్యం

కేరళలో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్ తమిళ్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.;

Update: 2025-03-11 19:30 GMT

కేరళలో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్ తమిళ్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 2012లో 'కాదలిల్ సోదప్పువదు యెప్పడి'లో ముఖ్య పాత్రలో నటించడం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. తక్కువ సమయంలోనే కోలీవుడ్‌లో ఈ అమ్మడికి గుర్తింపు లభించింది. 2013 నుంచి వరుసగా తమిళ్‌ సినిమాలు చేస్తూ వస్తున్న ఐశ్వర్య మీనన్ పలువురు స్టార్‌ హీరోల సినిమాల్లో కనిపించి అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. తమిళ్‌తో పాటు కన్నడ సినిమాలోనూ నటించే అవకాశాన్ని ఐశ్వర్య మీనన్ సొంతం చేసుకుంది. తెలుగులో స్పై, భజే వాయు వేగమ్‌ సినిమాల్లో నటించడం ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువ అయింది.


సోషల్ మీడియాలో 3.2 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఐశ్వర్య మీనన్ రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తద్వార తన ఫాలోవర్స్‌కి వినోదాన్ని పంచుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఐశ్వర్య మీనన్ అందమైన ఫోటోలను షేర్ చేసింది. క్యూట్‌ ఐశ్వర్య మీనన్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎక్కువ స్కిన్‌ షో చేయకున్నా ఐశ్వర్య మీనన్‌ ఫోటోలు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. చూడ్డానికి నాజూకుగా కనిపిస్తూ ఉండే ఐశ్వర్య మీనన్‌ మరోసారి తన సుందరమైన లుక్‌ ఫోటోలను అత్యంత స్టైలిష్‌గా ఉన్న రూపంను ఫోటోల రూపంలో షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.



ఎంతో మంది హీరోయిన్స్‌తో పోల్చితే ఐశ్వర్య మీనన్‌ అందం విషయంలో టాప్ ఉంటుందని, కానీ ఈమెకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు, రావాల్సిన ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈమె నటించిన రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో తెలుగులో ఈమెకు మరో ఆఫర్‌ ఇప్పటి వరకు రాలేదు. ముందు ముందు అయినా తెలుగులో ఈమెకు మంచి గుర్తింపు దక్కాలంటూ ఈ ఫోటోలు చూసిన వారు కామెంట్‌ చేస్తున్నారు. ఇంతటి అందగత్తెకు కచ్చితంగా మంచి ఆఫర్‌ దక్కాలనే అభిప్రాయంను మీడియా వర్గాల వారు సైతం వ్యక్తం చేస్తున్నారు.


ఈమధ్య కాలంలో బాజూకా అనే మలయాళ సినిమా ఆఫర్‌ను సొంతం చేసుకుంది. చాలా ఏళ్ల క్రితం మలయాళ సినిమాలో నటించిన ఐశ్వర్య మీనన్‌ అప్పుడు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. అందుకే పెద్దగా ఆఫర్లు రాలేదు. అయినా కూడా ఐశ్వర్యకు మలయాళంలో ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది. తమిళంలో ఒక సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో కూడా ఈమె నటించాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. మరి ఎప్పటికి తెలుగులో ఈ అమ్మడికి ఆఫర్‌ వస్తుంది అనేది చూడాలి.

Tags:    

Similar News