కాంట్ర‌వ‌ర్సీ క‌థాంశంతో టాలెంటెడ్ హీరో మూవీ

అందులో ఒక‌టి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాగా మ‌రొక‌టి కొత్ డైరెక్ట‌ర్ కీర్తిశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ.;

Update: 2025-03-11 18:30 GMT

త‌మిళ టాలెంటెడ్ న‌టుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ న‌టుడిగా, డైరెక్ట‌ర్ గా త‌న స‌త్తా చాటుతున్నాడు. రీసెంట్ గా డ్రాగ‌న్ మూవీతో హీరోగా సూప‌ర్ హిట్ అందుకున్నాడు ప్ర‌దీప్. డ్రాగ‌న్ స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ఇప్పుడు రెండు క్రేజీ సినిమాల్లో హీరోగా న‌టిస్తున్నాడు. అందులో ఒక‌టి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాగా మ‌రొక‌టి కొత్ డైరెక్ట‌ర్ కీర్తిశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ.

ల‌వ్ ఇన్యూరెన్స్ కంపెనీ సినిమా షూటింగ్ దాదాపు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకోగా ఈ సినిమాను స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ధీమా అనే ఫ‌స్ట్ సింగిల్ రిలీజై ఇన్‌స్టంట్ ఛార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని మిగిలిన పాట‌లు కూడా బావున్నాయ‌ని కోలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి.

అయితే ఇప్పుడు LIK మూవీ కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బ‌య‌టికొచ్చి సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా క‌థాంశం 10 ఏళ్ల ఫ్యూచ‌ర్ లో ఉంటుంద‌ట‌. అంతేకాదు, సినిమాలో తండ్రీ, కొడుకు ఇద్ద‌రూ ఒకే కాల్ గ‌ర్ల్ తో ప్రేమ‌లో ప‌డ‌తార‌ని తెలుస్తోంది. ఈ విష‌యం తెలిశాక LIK మూవీ మ‌రింత ఇంట్రెస్టింగ్ మారింది.

విన‌డానికి పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న‌ప్ప‌టికీ ఈ పాయింట్ కు కాంట్ర‌వ‌ర్సీ అయ్యే సూచ‌న‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గ‌తంలో ఇదే క‌థాంశంతో త‌మిళ మూగ సినిమా సింధు స‌మ‌వేలిని వ‌చ్చింది.

విచిత్ర‌మైన రొమాంటిక్ కామెడీల‌ను తీయ‌డంలో మంచి టాలెంట్ ఉన్న విఘ్నేష్ శివ‌న్ గ‌త కొన్ని సినిమాలుగా వ‌రుస డిజాస్ట‌ర్లు అందుకుంటున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి కం బ్యాక్ అవాల‌ని చూస్తున్నాడు విఘ్నేష్. వ‌రుస హిట్ల‌తో మంచి ఫామ్ లో ఉన్న ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్, విఘ్నేష్ కాంబినేష‌న్ లో ఎలాంటి సినిమా వ‌స్తుందో చూడాలి మ‌రి.

Tags:    

Similar News