పుష్ప 2.. టికెట్ రేట్ల మోత గ్యారెంటీ..!

డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా కలెక్షన్స్ భారీగా రాబట్టేందుకు నిర్మాతలు ఒక రేంజ్ స్కెచ్ వేశారు.

Update: 2024-11-28 05:24 GMT

డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా కలెక్షన్స్ భారీగా రాబట్టేందుకు నిర్మాతలు ఒక రేంజ్ స్కెచ్ వేశారు. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ బజ్ ఏర్పరచుకున్న పుష్ప 2 సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. అందుకే సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచాలని ఫిక్స్ అయ్యారు. స్టార్ సినిమాలకు మొదటి వారం టికెట్ రేట్లు పెంచడం చాలా కామన్. ఐతే పుష్ప 2 కి మామూలుగా పెంచే టికెట్ రేటు కన్నా మరో 150 నుంచి 200 ఎక్కువ ఉంటుందని టాక్. అలా ఉండేలా నిర్మాతలు ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాట్టు తెలుస్తుంది.

మొదటి రోజు నుంచి నాలుగు రోజుల పాటు స్టార్ సినిమాకు పెంచే రేటు కన్నా 200 అధికంగా ఉండేలా చూస్తున్నారు. ఇక ఐదో రోజు నుంచి 10వ రోజు వరకు స్టార్ సినిమాలకు పెంచే రేటుని ఫిక్స్ చేయాలని అంటున్నారు. 11వ రోజు నుంచి నార్మల్ టికెట్ రేటు తో నడిపించాలని చూస్తున్నారు. ఐతే ఇదే జరిగితే మాత్రం ప్రేక్షకుడి జేబుకి చిల్లు పడటం ఖాయమని చెప్పొచ్చు.

పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఐతే టికెట్ ప్రైజ్ పెంచడం అన్నది కామనే కానీ అది ఎంత అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. పుష్ప 2 మీద ఉన్న బజ్ కి ఎంత రేటు పెట్టినా టికెట్ కొని సినిమా చూసేయాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సుకుమార్ అల్లు అర్జున్ కలిసి పుష్ప 2 తో మరోసారి తమ సత్తా చాటాలని వస్తున్నారు.

సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా శ్రీలీల కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు బిజిఎం కోసం థమన్, అజనీష్, సామ్ సిఎస్ లను కూడా వాడుకున్నారని తెలుస్తుంది. ఇక పుష్ప 2 ఫైనల్ అయ్యాక ఫస్ట్ షో అల్లు అరవింద్ చూశారని సినిమాతో బ్లాక్ బస్టర్ పక్కా అన్నట్టు మేకర్స్ తో చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు సినిమా రికార్డులన్నీ తిరగరాస్తుందని కూడా అన్నారట.

అల్లు అరవింద్ జడ్జిమెంట్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన ఆయన ఒక సినిమాను కథగా ఉన్నప్పుడే వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చెప్పేస్తారు. మరి పుష్ప 2 విషయంలో ఆయన లెక్క కరెక్ట్ అవుతుందో లేదో చూడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News