పోయిన ఏడాదంతా ఆరు బంతులు-ఆరు సిక్సర్లు అంటూ ఒక థియరీతో ఊదరగొట్టేశాడు దిల్ రాజు. ఆ ఆరు బంతుల్లో నిజంగా బౌండరీ దాటినవి ఎన్ని అనే విషయంలో రకరకాల సందేహాలు రేకెత్తాయి. కానీ రాజు పట్టించుకోలేదు. ‘జవాన్’ సినిమా రూపంలో తన చేతికి అదనంగా ఒక బంతి వచ్చిందని.. అది కూడా బౌండరీ దాటేస్తుందని ధీమాగా చెప్పాడు. ఇది సూపర్ హిట్ అని నొక్కి వక్కాణించాడు. చివరికి చూస్తే అది కూడా సాయిధరమ్ ఫ్లాపుల ఖాతాలో చేరిపోయింది. దిల్ రాజు ఒక సినిమా గురించి చాలా ధీమాగా చెప్పాడంటే.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని.. నిజంగానే అది హిట్టవుతుందని జనాలకు గట్టి నమ్మకం ఉండేది ఒకప్పుడు. కానీ ఈ మధ్య ఆ నమ్మకం కొంచెం సడలుతోంది.
తాను హోల్ సేల్ గా సినిమాను కొనేసి రిలీజ్ చేస్తున్న ‘తొలి ప్రేమ’ గురించి కూడా రాజు గొప్పగానే చెబుతున్నాడు. రెండు దశాబ్దాల కిందట పవన్ కళ్యాణ్ కు ‘తొలి ప్రేమ’ ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో.. ఎలా అతడి కెరీర్ ను మలుపు తిప్పిందో.. ఈ ‘తొలి ప్రేమ’ కూడా వరుణ్ కు అంతే పేరు తెచ్చిపెడుతుందని.. కెరీర్ ను మలుపు తిప్పుతుందని రాజు ధీమాగా చెప్పాడు. తాను సినిమా చూశానని.. చాలా బాగా వచ్చిందని.. అందుకే తాను ఈ సినిమాను మొత్తంగా కొనేశానని రాజు చెప్పాడు. నిజానికి ఈ చిత్రాన్ని తానే నిర్మించాల్సిందని.. ఈ కథను దర్శకుడు వెంకీ ముందు తనకే చెప్పాడని.. కాకపోతే అప్పటికి ‘ఫిదా’తో బిజీగా ఉండటం వల్ల తాను చేయలేకపోయానని.. దీంతో వెంకీ భోగవల్లి ప్రసాద్ దగ్గరికి వెళ్లాడని.. ఆయన సినిమాను టేకప్ చేసి తనను అనుమతి అడగడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని.. ఈ రోజుల్లోనూ ఇలాంటి నిర్మాతలుంటారా అనిపించిందని.. అలాగే సినిమా పూర్తయ్యాక తానే కొనాలని కూడా అడిగారని.. సినిమా బాగుండటంతో తాను కొన్నానని రాజు చెప్పాడు. మరి ‘తొలి ప్రేమ’ గురించి దిల్ రాజు చూపిస్తున్న నమ్మకం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.