మహర్షి : మరీ ఎక్కువ అయితే కష్టమే

Update: 2019-02-15 06:56 GMT
మహేష్‌ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం 'మహర్షి' షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల చివర్లో లేదా మార్చి మొదటి వారంలో షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టేసే అవకాశం కనిపిస్తుంది. మరో వైపు ఈ చిత్రంకు డబ్బింగ్‌ పనులు కూడా మొదలు పెట్టారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంపై దిల్‌ రాజు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ ఏడాది మా బ్యానర్‌ లో రాబోతున్న 'మహర్షి' మరియు '96' రీమేక్‌ చిత్రాలు మా బ్యానర్‌ కు మంచి పేరు తెస్తాయంటూ గంట కొట్టి మరీ చెబుతున్నాడు. సహజంగా ఏ నిర్మాత అయినా తాను చేసే ప్రతి సినిమా గురించి ఆలాగే చెప్తాడు. కాని దిల్‌ రాజు మాత్రం మరీ ఇంత గట్టిగా చాలా తక్కువ సార్లు చెబుతాడు.

దిల్‌ రాజు ఈ చిత్రంపై జనాల్లో ఇంకాస్త ఆసక్తి కలిగించేలా ఒక్కొక్కటి చొప్పున ప్రకటన చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా పూర్తి అయిన తర్వాత భారమైన గుండెలతో ప్రేక్షకులు బయటకు వస్తారని అన్నాడు. అంటే సెంటిమెంట్‌ కాస్త అధిక మోతాదులో ఉంటుందన్నమాట. స్నేహితుల మద్య సెంటిమెంట్‌ మరియు తల్లిదండ్రి సెంటిమెంట్‌ ను ఈ చిత్రంలో చూపించబోతున్నారట.

ఒక బిజినెస్‌ మ్యాన్‌ అయిన వ్యక్తి స్నేహితుడి కోసం వచ్చి మహర్షిలా ఎలా మారాడు అనేది ఈ చిత్రంలో చూపించనున్నట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సినిమాలే ఉన్నాయి. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటే సినిమా ఆడేస్తుంది. మరి మహర్షి సినిమానేమో ఏడిపిస్తుందని దిల్‌ రాజు ఇండైరెక్ట్‌ గా చెబుతున్నాడు. మరి మహర్షి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఏప్రిల్‌ నాల్గవ వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Tags:    

Similar News