సినిమా పరిశ్రమలో సక్సెస్ ని ఫెయిల్యూర్ ని ముందే ఊహించడం కష్టం. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా డిజాస్టర్ అయిపోయి కోట్ల నష్టాలు తేవొచ్చు. ఆడుతుందో లేదో అని డౌట్ పడి శాటిలైట్ ని తక్కువకు అమ్ముకున్న సినిమా బ్లాక్ బస్టర్ కావొచ్చు. అనూహ్యం అనే మాట ఇండస్ట్రీకి అతికినట్టు సరిపోతుంది. అందుకే ఎంత తలపండిన నిర్మాత అయినా ఖచ్చితమైన లెక్కలు వేయడం అసాధ్యం. ఇది తెలిసే కాబోలు దిల్ రాజు చాలా తెలివిగా సంక్రాంతి సినిమాల మీద పెట్టుబడి పెడుతున్నారు అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.
తన స్వంత నిర్మాణంలో దిల్ రాజు చేస్తున్న ఎఫ్2 ఈ నెల 12న రానున్న సంగతి తెలిసిందే. మెగా దగ్గుబాటి కాంపౌండ్ ల హీరోలు ఇద్దరు ఉన్నా ఎందుకో దీనికి కావాల్సినంత బజ్ ఇటు ట్రేడ్ లో కానీ ప్రేక్షకుల్లో కానీ కనిపించడం లేదు. టాక్ బాగా వస్తే తప్ప ఇలాంటివి నిలదొక్కుకోవడం కష్టం. అయితే ఇదిలా ఉండగా తనది కానీ వినయ విధేయ రామ నైజామ్ మరియు వైజాగ్ హక్కులను దిల్ రాజు ఫాన్సీ రేట్లకు సొంతం చేసుకున్నట్టు టాక్. ఒకవేళ ఎఫ్2 కనక పోటీ ధాటికి తట్టుకోలేక ఆశించిన ఫలితం దక్కకపోతే దాని వల్ల కలిగే నష్టాన్ని ఇలా విదేరా రాముడి రూపంలో రికవర్ చేసుకోవచ్చన్న మాట.
ఒకవేళ అటు ఇటు అయినా ఓకే. ఏదో రూపంలో సేఫ్ కావొచ్చు. నిజానికి ఎఫ్2 విషయంలో దిల్ రాజు ఊహించిన రేంజ్ లో హంగామా చేయడం లేదు. కాస్త స్థబ్దుగా ఉన్నది ఈ మూవీనే. కారణం ఏదైనా దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ఒక సినిమా మీద పెట్టుబడులు పెట్టి రిస్క్ లేకుండా సేఫ్ అవ్వడం కోసం మంచి ప్లాన్ లోనే ఉన్నారు. అయితే ఇందులో ఖచ్చితంగా ఒకటైనా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటేనే ఇది వర్క్ అవుట్ అయినట్టు.
Full View