దిల్ రాజు పంట మళ్లీ పండినట్లే

Update: 2015-08-14 12:11 GMT
సినిమాల్ని జడ్జ్ చేయడంలో దిల్ రాజుకు తిరుగులేదంటారు. కానీ మధ్యలో ఆయన  పేరు బాగా దెబ్బతింది. ఇటు సొంతంగా తీసిన సినిమాలు.. అటు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు దెబ్బ తీయడంతో పాటు ‘జడ్జిమెంట్ కింగ్’ అనే పేరు కూడా పోయింది. కానీ ఈ ఏడాది మాత్రం ఆయనకు భలేగా కలిసొస్తోంది. ‘పటాస్’తో మొదలుపెట్టి  ‘బాహుబలి’ దాకా ఆయన పట్టిందల్లా బంగారమే. ఈ ఏడాది తక్కువలో రాజు తక్కువ పాతిక కోట్లయినా వెనకేసి ఉంటాడంటే ఆశ్చర్యమేమీ లేదు. తాజాగా ఇంకో విజయం ఆయన ఖాతాలో చేరింది. అదే ‘సినిమా చూపిస్త మావ’. ఏదో దిల్ రాజుకు చూపించి.. ఆయన బాగుందంటే సినిమాకు క్రేజ్ వచ్చేస్తోందని నిర్మాతలు ట్రై చేస్తే.. ఆ సినిమా రాజుకు మహబాగా నచ్చేసి ఆన్ ద స్పాట్ అగ్రిమెంట్ చేసేసుకున్నారు.

నైజాం ఏరియాకు కేవలం కోటి  రూపాయలు పెట్టి ‘సినిమా చూపిస్త మావ’ను విడుదల చేశాడు రాజు. సినిమాకు మార్నింగ్ షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. రాజు చెప్పినట్లు ప్రేక్షకులు స్పెల్ బౌండ్ కాకపోవచ్చు కానీ.. సినిమా జనాలకు బాగానే నచ్చే అవకాశాలున్నాయి. నైజాం రైట్స్ కోటి రూపాయలే అంటే రాజు చాలా తక్కువకు పట్టేసినట్లే. ఐతే రాజు సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడి.. సినిమాను విడుదల చేయడం వల్ల దానికొచ్చిన ప్రయోజనంతో పోలిస్తే ఇది పెద్ద మ్యాటర్ కాదనే చెప్పాలి. తొలి రోజు వసూళ్లకు ఎలాగూ ఢోకా  ఉండదు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సెలవు. తర్వాతి రోజు  ఆదివారం. ఈ మూడు రోజుల్లోనే రాజు పెట్టుబడి వసూలైపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పెట్టుబడి మీద రెట్టింపు సంపాదించునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News