థియేట్రికల్ రిలీజ్ కి ముందు ప్రచారానికి.. ఓటీటీ రిలీజ్ కి ముందు ప్రచారానికి తేడా ఏమిటి? అంటే అమెజాన్ ప్రైమ్ వాళ్లు హీరోలు నిర్మాతలకు ప్రాక్టికల్ గానే చెబుతున్నారట. కంగారు పడి ఒక ట్వీట్ వేసేయడమో లేక ఇన్ స్టాలో పోస్టింగు పెట్టడమో చేసేస్తామంటే కుదరదు. అమెజాన్ అంటే అంతా కార్పొరెట్ స్టైల్. దానికి తగ్గట్టే `వి` మూవీ ప్రచారాన్ని డిజైన్ చేశారట.
అయితే ట్రైలర్ రిలీజ్ మాత్రం అబాసుపాలైంది. వినూత్న విధానం పేరుతో విసిగించారని తిట్టేసారు నెటిజనం. అదంతా సరే కానీ.. ఓవైపు మీడియా ఇంటర్వ్యూలతో హీరోలు వేడి పెంచనున్నారు. ఇప్పటికే దర్శకుడు.. హీరో బరిలో దిగారు. దర్శకనిర్మాతలు ఇంద్రగంటి.. దిల్ రాజు కూడా మీడియా లైవ్ ఇంటర్వ్యూల్లో హీటెక్కించే ప్లాన్ వేశారు. సెప్టెంబర్ 5న ప్రైమ్ లో రిలీజ్ కి ముందే భారీగా ప్రచారం చేయనున్నారు.
ఇకపోతే ప్రీరిలీజ్ లు.. ఆడియో ఫంక్షన్లు అంటూ ఇంతకుముందులా అనవసర పబ్లిసిటీ బాకా ఏదీ లేదు. ప్రమోషన్స్ కోసం లక్షలు కోట్లు తగలేయాల్సిన అవసరం కూడా లేదిప్పుడు. ఆ రకంగా దిల్ రాజుకు బాగానే కలిసొస్తోందట. టీవీ ప్రింట్ వెబ్ ప్రకటనలు అంటూ అనవసర ఖర్చు ఏదీ లేదట. నిజానికి థియేట్రికల్ రిలీజ్ ఉన్నప్పుడే దిల్ రాజు వైపునుంచి మీడియాకి ఎంకరేజ్ మెంట్ అంతంత మాత్రమే. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా పోయింది అంటూ మీడియా గుసగుసలాడుకుంటోంది.
మొత్తానికి వి ని ఓటీటీలో బంపర్ హిట్ చేయనున్నారట. అయితే ఇది హిట్టు ఫట్టు అన్నదానికి ఇక్కడ ప్రమాణికత లేదు. తొలి రోజు ఎంతమంది చూశారు? అన్నది మాత్రం వ్యూవర్ షిప్ తెలుస్తుంది. అలాగే క్రేజీ సినిమా కాబట్టి అమెజాన్ ప్రైమ్ కి కొత్త సబ్ స్క్రైబర్లు పెరుగుతారన్నమాట. ఇక వీ ప్రమోషన్ స్ట్రాటజీనే తదుపరి రిలీజ్ కి వచ్చే వాళ్లంతా అనుసరించనున్నారట.