ఒకే ఒక్క హిట్టు ఎంత ఉత్సాహాన్నిస్తుందో చెప్పాల్సిన పనే లేదు. బ్లాక్ బస్టర్ కొడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. వరల్డ్ కప్ కొట్టినంత ఉత్సాహం సినిమాకి పని చేసిన టీమ్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం `ఎఫ్ 2` టీమ్ లో అదే జోష్ కనిపించడం పరిశ్రమలో ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఇటీవలే 50 రోజుల వేడుకను నిర్వహించింది టీమ్. ఈ వేదిక ఆద్యంతం అసిస్టెంట్ డైరెక్టర్లు - రైటర్లు సహా ప్రొడక్షన్ టీమ్ ఎంతో జోష్ తో కనిపించింది. అయితే ఆ జోష్ వెనక చాలానే పెద్ద కారణం ఉంది.
ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అన్న టాక్ రాగానే ముందుగా ప్రొడక్షన్ టీమ్ కి అదిరిపోయే తాయిలం అందింది. రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగానే ప్రొడక్షన్ టీమ్ మొత్తాన్ని బ్యాంకాక్ పంపించారు దిల్ రాజు. కేవలం ఆ ట్రిప్ కోసమే 50లక్షలు పైగా ఖర్చు చేశారని ప్రచారమైంది. తాజాగా అర్థ శతదినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని మరో హాట్ అప్ డేట్ అందింది. ఎఫ్ 2 డైరెక్షన్ టీమ్ కి ఐఫోన్ లను రాజుగారు కానుకగా ఇచ్చారట. దీంతో ఫుల్ జోష్ లో అసిస్టెంట్లు పండగ చేసుకున్నారని వేదిక వద్ద మాట్లాడుకోవడం విశేషం.
వెంకీ- వరుణ్ తేజ్ హీరోలుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన `ఎఫ్ 2` బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 130 కోట్ల వసూళ్లు తెచ్చింది. దాదాపు 70 కోట్లు పైగా షేర్ వసూలు చేసింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లో అతి పెద్ద విజయమిది. అందుకే ఈ జోష్ లో రాజుగారు దిల్ ఖుష్ అవుతున్నారట. 2018 లో వచ్చిన నష్టాలన్నిటినీ ఈ సినిమా పూడ్చిందని.. ఆ ఉత్సాహంలోనే ఇలా డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లు సహా తన వద్ద పని చేసే టీమ్ లన్నిటితో సెలబ్రేషన్స్ కంటిన్యూ చేస్తున్నారని ముచ్చటించుకుంటున్నారు. అసలింతకీ తనకు ఇంత పెద్ద హిట్టిచ్చిన అనీల్ రావిపూడికి రాజుగారు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు? అంటే బీఎండబ్ల్యూ గిఫ్ట్ ఇచ్చారని ఓ ప్రచారం ఉంది. అయితే తనకు ఓ స్పెషల్ గిఫ్ట్ అందిందని మాత్రమే దర్శకుడు అనీల్ రావిపూడి చెబుతున్నారు. ఇక అసిస్టెంట్ల టీమ్ కి ఐఫోన్ లు ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే.. ఇదివరకూ `భరత్ అనే నేను` అసిస్టెంట్లకు మహేష్- నమ్రత జంట ఐఫోన్ కానుకలిచ్చారు. ఆ ఐడియా చాలా బావుందని సేమ్ ఫార్ములాని దిల్ రాజు అనుసరించారని ముచ్చట సాగుతోంది. మొత్తానికి ఇలా టీమ్ అందరినీ సంతోషంగా ఉంచితే ఈ ఉత్సాహంలో మరో బ్లాక్ బస్టర్ కి తెర తీయొచ్చన్నది ప్లాన్ అన్నమాట!