ఫిలింఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు `యాక్టివ్ ప్యానెల్`పై సి.కళ్యాణ్ `మన ప్యానెల్` నెగ్గింది. అయితే ఈ ఎన్నికల ఫలితం అంతిమంగా ఏం తేల్చింది? అంటే... సంఘంలో ఆ నలుగురికే గుర్తింపు ఉన్నా.. మెజారిటీ సభ్యుల సపోర్ట్ లేనిదే ఏదీ చేయలేరని నాయకుడు అసలే కాలేరని ఈ ఫలితం తేల్చింది! మేం మాత్రమే పరిశ్రమను శాసిస్తున్నాం! అని భావిస్తే అందుకు ఫలితం వేరుగా ఉంటుందన్న వాదనా నిర్మాతల్లో వినిపించింది. అందరినీ కలుపుకుని పోయేవాడే నాయకుడు కాగలడన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ విషయంలో సి.కళ్యాణ్ అందరినీ కలుపుకుని వెళ్లారు కాబట్టే ఎలక్షన్ లో నెగ్గారని అంటున్నారంతా.
ఇక ఈ ఎన్నికల ముందు సి.కళ్యాణ్ .. దిల్ రాజు ఇద్దరిపైనా ఓ మీడియా ఆసక్తికర ప్రశ్నలు వేస్తే అందుకు ఆ ఇద్దరి సమాధానాలు ఆసక్తిని రేకెత్తించాయి. ఈ ఎన్నికల్లో అసలేం జరగబోతోంది? అన్న ప్రశ్నకు సి.కళ్యాణ్ మాట్లాడుతూ ``అందరినీ మన అనుకునే ఎన్నికలకు వెళుతున్నాం. ఒంటిగంటకు ఫలితం చెబుతుంది`` అన్న ధీమాను కనబరిచారు. ఇండస్ట్రీలో అందరూ మన అనుకున్నాం.. అవతలివారిని కలుపుకుని వెళతాం.. పేదల పార్టీ మాది .. అందుకే గెలుస్తాం అని ధీమాను వ్యక్తం చేశారు. వారు బాధ్యతలు తీసుకుంటామంటే.. ఇవ్వడమేనని పదవుల పిచ్చి లేదని సి.కళ్యాణ్ అన్నారు. నిర్మాతల గిల్డ్ సభ్యులెవరూ మీతో కలవనన్నారు కదా? అని ప్రశ్నిస్తే సి.కళ్యాణ్ `వార్ చేస్తా`మని వ్యాఖ్యానించారు.
ఇక అవే ప్రశ్నలు దిల్ రాజును అడిగితే ఆయన స్పందన వేరొకలా వినిపించింది. ``మనం అనుకునే వాళ్లు ఎలక్షన్ వరకూ రారు కదా? మనం అనుకోలేదు కాబట్టే ఎలక్షన్ కి వచ్చారు. సాయంత్రం 5 గం.లకే అంతా తేల్తుంది. అప్పుడు అన్నీ చెబుతాను. సినిమాలు తీసేవాళ్లంతా ఒక నిర్ణయం తీసుకుంటారు`` అని హెచ్చరికగా వ్యాఖ్యానించారు. ఇక నిర్మాతల గిల్డ్ వచ్చి కలవకపోతే `వార్` చేస్తామని సి.కళ్యాణ్ అన్నారు. మీరేమంటారు? అని దిల్ రాజును ప్రశ్నిస్తే.. ``ఇక్కడ ఎవరూ వార్ చేసినా ఏమీ జరగదు. ఇది వ్యాపారం. డబ్బు పెట్టేవాళ్లు తిరిగి ఎలా తెచ్చుకోవాలి? అనేది చూడాలి. అందరూ మభ్య పెట్టేందుకు చాలా మాట్లాడతారు. పదిహేనేళ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు`` అంటూ కాస్తంత ఆవేశంగానే మాట్లాడారు. మొత్తానికి ఎన్నికల వేళ ఇరు ప్యానెల్స్ మధ్యా చిన్నపాటి వార్ నడిచిందన్నది ప్రూవైంది. ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరన్నందుకు! రాజుగారి ప్యానెల్ నెగ్గి చూపించాల్సింది. రాజుగారు నెగ్గినా గెలిపించాలనుకున్న ప్యానెల్ మాత్రం నెగ్గింది. ఒక రకంగా గర్వభంగమైంది. అన్నట్టు సాయంత్రం 5 తర్వాత అన్నీ చెబుతానని దిల్ రాజు హెచ్చరించారు. ఇంతకీ ఏం చెప్పబోతున్నారో ఆయన?