దిల్ రాజు కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లున్నాయి. బ్లాక్ బస్టర్లున్నాయి. ఆయా సినిమాలతో భారీగా లాభాలందుకున్నాడు రాజు. ఐతే ఇప్పటిదాకా రాజు తీసిన 23 సినిమాలతో పోలిస్తే.. ఆయన లేటెస్ట్ మూవీ ‘శతమానం భవతి’నే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా దాదాపు రూ.20 కోట్ల దాకా రాజుకు లాభం తెచ్చిపెట్టి ఉండొచ్చని అంటున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యం కలిగించొచ్చు కానీ.. ‘శతమానం భవతి’ లెక్కలు చూస్తే ఇది వాస్తవమే అయ్యుండొచ్చనిపిస్తోంది.
‘శతమానం భవతి’ సినిమాను రూ.8-9 కోట్ల మధ్య బడ్జెట్లో పూర్తి చేశాడు రాజు. తనకు బాగా పట్టున్న.. థియేటర్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్న నైజాం ఏరియాతో పాటు వైజాగ్ కూడా తనకే ఉంచుకుని.. మిగతా ఏరియాల హక్కులన్నింటినీ అమ్మేశాడు. ఈ అమ్మకాలతోనే దాదాపుగా రాజుకు పెట్టుబడి గిట్టుబాటు అయిపోయినట్లు సమాచారం. నైజాం.. వైజాగ్ వసూళ్లన్నీ పూర్తిగా లాభమే అన్నమాట. ఈ రెండు ఏరియాల్లో ‘శతమానం భవతి’ మామూలు వసూళ్లు రాబట్టలేదు. నైజాంలో అనూహ్యంగా రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. వైజాగ్ ఏరియాలోనూ ఇదే రీతిలో పెర్ఫామ్ చేసింది. అక్కడ రూ.5 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉంది ‘శతమానం భవతి’. అంటే ఈ రెండు ఏరియాలతో వచ్చిన రూ.15 కోట్ల షేర్ రాజుకు దక్కిన లాభం.
ఇక ‘శతమానం భవతి’ శాటిలైట్ డీల్ అయ్యిందో లేదో క్లారిటీ లేదు. ఇప్పుడు కనుక ఆ సినిమాను అమ్మితే ఈజీగా రూ.5 కోట్లు ఖాతాలో పడబోతున్నట్లే. విడుదలకు ముందే డీల్ పూర్తి చేసి ఉన్నా 3-4 కోట్ల మధ్య వచ్చి ఉంటుంది. ఆడియో హక్కులు ఇతరాలు కలిపితే మొత్తంగా రాజుకు ఎలా కాదన్నా రూ.20 కోట్ల లాభం వచ్చినట్లే అన్నమాట. బహుశా రాజు కెరీర్లో ఏ సినిమాకూ ఇంత లాభం వచ్చి ఉండదేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/