కోలీవుడ్ సహా బాలీవుడ్ లోను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఇటీవల ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా జెర్సీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన దిల్ రాజు తదుపరి హిందీ మార్కెట్ కోసం పలు భారీ రీమేక్ లను సిద్ధం చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసిన జెర్సీకి దిల్ రాజు తో పాటు అల్లు అరవింద్- సితార అధినేతలు నిర్మాతలుగా కొనసాగారు. దీనికోసం హిందీ నిర్మాణ సంస్థతో టై అప్ అయ్యారు.
కానీ ఈసారి అలా కాదు. నేరుగా బాలీవుడ్ కోసం ఇతరుల సాయం అవసరం లేకుండా తానే స్వయంగా `హిట్` చిత్రాన్ని రీమేక్ చేశాడు. హిందీ నిర్మాతలు ఉన్నా కానీ స్వయంగా కంటెంట్ పరంగా తనే హవా సాగించాడు. విశ్వక్ సేన్ కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ రీమేక్ హిందీ వర్షన్ లో రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించారు. శైలేష్ చిత్రీకరణ ముగించి.. అడివి శేష్ తో హిట్ సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో బిజీ అవుతున్నాడు. అయితే హిందీలో `హిట్` రిలీజై హిట్టు కొట్టాలంటే ఏం చేయాలన్నది అస్పష్టం.
అయితే ఉత్తరాది మార్కెట్లో పాగా వేయడం ఎంతటివారికైనా అంత సులువేమీ కాదు. నైజాం కింగ్ గా ఉన్న దిల్ రాజు ఏపీలోనూ విశాఖ- ఉత్తరాంధ్రలో థియేటర్లను కలిగి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ కం పంపీణీదారుగా సుదీర్ఘమైన కమ్యూనికేషన్ ఉంది. కానీ దిల్ రాజుకు అతనికి బాలీవుడ్ లో పట్టు లేదు. దానివల్ల తన గేమ్ ప్లాన్ ని మార్చారని తెలిసింది. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ PVRతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా దిల్ రాజు ఇప్పుడు ఉత్తరాదిన స్వయంగా HIT చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. థియేటర్ల పరంగా PVR సహాయం చేస్తుందని తెలిసింది.
దేశమంతా దిల్ రాజు పేరు మార్మోగుతోంది. అటు రామ్ చరణ్ -శంకర్ లతో సినిమాని నిర్మిస్తూ జాతీయ వార్తల్లో హవా సాగిస్తున్నాడు. హిట్ సినిమా జాతీయ మార్కెట్లో హిట్టు కొడితే అతడి హవా మొదలైనట్టే. బాహుబలి- ఆర్.ఆర్.ఆర్ - పుష్ప లాంటి చిత్రాలకు భారీ నిర్మాణ సంస్థల బ్యాకప్ ఉంది. ఇప్పుడు దిల్ రాజు ఎలాంటి సహాయం లేకుండా హిందీ మర్కెటలో ఎలాంటి మార్క్ వేస్తాడో చూడాలి.