ఎఫ్‌3 బడ్జెట్‌ లెక్క.. దిల్‌ రాజు మాస్టర్‌ ప్లాన్‌

Update: 2020-12-02 03:32 GMT
గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్‌ 2 కు సీక్వెల్‌ తీయాలని అప్పుడే నిర్మాత దిల్‌ రాజు మరియు దర్శకుడు అనీల్‌ రావిపూడి భావించారు. అందుకు సంబంధించిన స్టోరీ లైన్‌ గురించి అప్పటి నుండే చర్చ జరుగుతూ వచ్చింది. ఎఫ్‌ 3 అంటూ టైటిల్‌ ను కూడా రిజిస్ట్రర్‌ చేయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కబోతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంక్రాంతికి ఎఫ్‌ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని కరోనా కారణంగా వచ్చే సంక్రాంతికి ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఇక ఈ సినిమా బడ్జెట్‌ 50 కోట్లు అంటూ ప్రచారం జరుగుతోంది. ఎఫ్‌ 2 సినిమా 100 కోట్ల వసూళ్లను సాధించిందనే టాక్‌ ఉంది. నిర్మాత దిల్‌ రాజుకు అన్ని విధాలుగా భారీ లాభమే వచ్చింది. కనుక ఎఫ్‌ 3 ని అంతకు మించిన బడ్జెట్‌ తో రూపొందించినా లాభం మాత్రం ఖాయంగా వస్తుందనే అభిప్రాయం ఉంది. అయితే దిల్‌ రాజు ఎఫ్‌ 3 బడ్జెట్‌ విషయంలో చాలా కండీషన్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. పారితోషికాలుగా ఇద్దరు హీరోలకు మరియు దర్శకుడికి కలిపి 30 కోట్ల రూపాయలను ఇవ్వబోతున్నాడు. హీరోయిన్స్‌ మరియు ఇతర కాస్టింగ్‌ కు మరియు టెక్నీషియన్స్‌ కు కలిపి 8 నుండి 10 కోట్లు ఇవ్వబోతున్నారు. ఇక అంటే పారితోషికాలే దాదాపుగా 40 కోట్లు అవుతున్న నేపథ్యంలో మేకింగ్‌ విషయంలో రాజీ పడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎఫ్‌ 3 సినిమాకు పని చేయబోతున్న పారితోషికాలే దాదాపుగా రూ.40 కోట్లు ఉంటే మరో 10 కోట్లలో ఎలా సినిమా పూర్తి అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సమయంలో అనీల్‌ రావిపూడి మరియు దిల్‌ రాజులు కలిసి మాస్టర్‌ ప్లాన్‌ వేశారనే ప్రచారం జరుగుతోంది. సినిమా లో బడ్జెట్‌ అని తెలియకుండా రిచ్‌ గా కనిపిస్తూనే తక్కువ బడ్జెట్‌ లో పూర్తి అయ్యేలా దర్శకుడు అనీల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఆయన గత సినిమాలను చూస్తే తక్కువ బడ్జెట్‌ లోనే పూర్తి అయ్యాయి. కాని అలా లో బడ్జెట్‌ సినిమాలు.. మీడియం బడ్జెట్‌ సినిమాలు అని మాత్రం అనిపించదు. ఇప్పుడు ఎఫ్‌ 3 ని కూడా అలాగే ప్లాన్‌ చేస్తున్నాడట.
Tags:    

Similar News