రూటు మారుతుందంటున్న రాజు గారు!!

Update: 2018-10-01 13:07 GMT
గత ఏడాది వరుస సక్సెస్ లను ఎంజాయ్ చేసిన నిర్మాత దిల్ రాజు ఈ ఏడాది రెండే సినిమాలు విడుదల చేసినప్పటికీ అవే పెద్ద దెబ్బ వేసాయి. దసరాకు రిలీజ్ కాబోతున్న హలో గురు ప్రేమ కోసమే మీదే ఆశలన్నీ పెట్టుకున్న దిల్ రాజు దాని మీద మాత్రం చాలా నమ్మకం పెట్టుకున్నారు. సాధారణంగా దిల్ రాజు సినిమాల్లో గ్లామర్ షోలు ముద్దులు తక్కువగా కనిపిస్తాయి. క్లీన్ ఎంటర్ టైనర్స్ రూపొందించడం మీద ఆయన ఎక్కువ శ్రద్ధ పెడతారు. అదే మైనస్ గా నిలిచింది అనుకున్నారో ఏమిటో ఇకపై తాను కూడా ముద్దుల బాట పట్టాల్సి వచ్చేలా ఉందని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హుషారు అనే బడ్జెట్ మూవీ ఈవెంట్ కి హాజరైన దిల్ రాజు ఈ కామెంట్స్ చేయడం చూసి ఇటీవలి కాలంలో ముద్దుల పోస్టర్ల తో హైప్ తెచ్చుకుని హిట్ కొట్టిన సినిమాల గురించే అని అందరికి అర్థమైపోయింది. సరే దిల్ రాజు ఆ రూట్ లోకి వస్తారా లేదా అనేది పక్కన పెడితే కథ డిమాండ్ చేసినప్పుడు తన సినిమాల్లోను కాస్త ఆరబోతల చేసిన మాట వాస్తవమే. డీజే సినిమాలో పూజా హెగ్డే బికినీ సీన్ వల్లే తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో ప్రేక్షకులు మంచి చెడు ఆలోచించడం  లేదని లిప్ లాక్స్ కోసమే చూస్తున్నారని గట్టి చురకలే వేసిన దిల్ రాజు అవి లేకుండా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయనే లాజిక్ మర్చిపోయారు.

ఏదైతేనేం మొత్తానికి నేను కూడా ఈ రూట్లోకి రాబోతున్నాను అని దిల్ రాజు హింట్ ఇచ్చినట్టే ఉంది. హుషారు నిర్మాత బెక్కం వేణుగోపాల్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ వేడుకకు వచ్చిన దిల్ రాజు చెడునే ఇష్టపడే హీరో క్యారెక్టరైజేషన్ గురించి చేసిన సరదా వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి.


Tags:    

Similar News