అగ్ర నిర్మాతలు చిన్న సినిమాల్ని ప్రమోట్ చేయడం అన్నది నేటి ట్రెండ్. ఇటీవల రిలీజైన పలు చిత్రాలకు పలువురు అగ్ర నిర్మాతలు ప్రచార సాయం అందించారు. అవి విజయం సాధిస్తే ఆ సెలబ్రేషన్స్ కోసం హడావుడి చేసిన వారు ఉన్నారు. కానీ అగ్ర నిర్మాత దిల్ రాజు మాత్రం ఎందుకనో రాజ్ తరుణ్ `ఇద్దరి లోకం ఒకటే` ప్రమోషన్స్ ని లైట్ తీస్కున్నారు. ఆ సినిమాని సొంత బ్యానర్ లోనే తీసినా.. ప్రచారం లేదెందుకనో!
ఈ సినిమాకి రిలీజ్ డే రోజునే క్రిటిక్స్ పెదవి విరిచేశారు. ఔట్ డేటెడ్ అంటూ విమర్శించారు. దీంతో తీవ్రంగా హర్టయ్యారా ఏమో.. రాజుగారు అస్సలు ప్రమోషన్ అన్నదే చేయలేదు. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ ముందే రాజు గారు విజయంపై అనుమానం వ్యక్తం చేశారన్న ప్రచారం కూడా సాగింది. అనుకున్నంతా అయ్యేసరికి నిరాశపడ్డారో లేక టైమ్ వేస్ట్ ఎందుకని అనుకున్నారో అసలు ప్రచారం అన్నదే లేదు. మా సినిమా హిట్టు అంటూ చేసే హడావుడి ప్రచారం కూడా ఎక్కడా కనిపించలేదేమిటో! అయితే నిర్మాతనే ప్రచారం చేయకపోతే ఆ బాధ పంపిణీ వర్గాలకు ఉంటుంది కదా.. రాజుగారేమిటి ఇలా చేశారు? అంటూ ఇన్ సైడ్ ఆవేదన వ్యక్తమైందట.
అంతేకాదు.. అసలు ఇది శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో తెరకెక్కినదేనా.. లేక కేవలం ఆయన పేరు మాత్రమే ఉపయోగించుకుని చేశారా? అంటూ మరో సందేహం వ్యక్తమవుతోంది. పోస్టర్ లో బ్యానర్ పేరు కనిపించినంత మాత్రాన అది నిజం అని నమ్మడానికి లేదు! అన్న సందేహం వ్యక్తమైంది. ఎవరో చేసిన సినిమాల్ని ఇటీవల పెద్ద బ్యానర్ల పేర్లు వేసుకుని రిలీజ్ చేస్తున్నారు. ఇదేమైనా ఆ బాపతేనా? అన్న ముచ్చటా వేడెక్కిస్తోంది. అందుకే రిలీజ్ ముందూ ప్రచారం లేదు.. రిలీజ్ తర్వాత మమ అనిపించేశారు! అంటూ గుసగుస హీటెక్కిస్తోంది. ఎవరేం చేసినా ఇది యువహీరో రాజ్ తరుణ్ కి పంచ్ పడడమేనని అంటున్నారు మరి! అలాగే సంక్రాంతికి రిలీజవుతున్న భారీ చిత్రాల ప్రమోషన్ హడావుడి తప్ప చిన్న సినిమాల్ని పట్టించుకోరా! అన్న ఆవేదనా రాజ్ తరుణ్ అభిమానుల్లో మరో వైపు వ్యక్తమైంది.