పవర్ స్టార్ తో డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుంటే ఇలా చేస్తున్నారేం? పింక్ రీమేక్ విషయంలో ఇంకా ఎందుకీ డైలమా? చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూనే ఈ సినిమాలో కథానాయకుడు పవన్ కల్యాణ్ అని ప్రకటించలేని పరిస్థితి ఎందుకు ఎదురవుతోంది? ఈ డైలమా నుంచి నిర్మాత దిల్ రాజు బయట పడేది ఎప్పుడు? .. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వేడెక్కిస్తున్న టాపిక్ ఇది. ఓవైపు పరిశ్రమ వర్గాల్లో.. మరోవైపు అభిమానుల్లోనూ ఇదే చర్చ సాగుతోంది.
ప్రస్తుతం పింక్ ప్రీప్రొడక్షన్ వేగంగా పూర్తవుతోంది. దర్శకుడు వేణు శ్రీరామ్ - థమన్ తో బాణీల పని పూర్తి చేస్తున్నారు. రికార్డింగ్ కార్యక్రమాలు వేగంగానే పూర్తవుతున్నారు. నటీనటుల ఎంపిక పూర్తయిపోతోంది. ఫలానా కథానాయికను ఎంపిక చేశారు అంటూ అప్పుడే ప్రచారం వేడెక్కిస్తోంది. ఇదంతా రీమేక్ విషయం ప్రకటించిన రెండు వారాల్లోనే. అయితే ఇంకా ఎందుకనో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు అన్న ప్రకటన శ్రీవెంకటేశ్వర కాంపౌండ్ నుంచి వెలువడలేదు. ఆ స్వేచ్ఛ దిల్ రాజు తీసుకోనూ లేదు.
అయితే ఆయనలో ఇంకా డైలమా ఎందుకు? అంటే అందుకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్న పేరు రాజకీయాలతో ముడిపడి ఉంది ఇప్పుడు. జనసేన అధినేతగ ప్రజల్లో ఉన్నారు ఆయన. ఇంతకుముందులా ఎడా పెడా ప్రకటించేస్తామంటే కుదరని పని. అక్కడ కామా పెట్టి ఇక్కడ టైమ్ స్పెండ్ చేయలేని పరిస్థితి ఉందిప్పుడు. సరిగ్గా అతడు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఈ టైమ్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించని బాంబ్ పేల్చారు. ఏపీకి ఒకటి కాదు మూడు రాజధానులు!! పాలనను వికేంద్రీకరిస్తున్నాం! అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు పంచుతున్నాం!! అంటూ జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో అది కాస్తా రాజకీయంగా వేడి పుట్టించింది. దీంతో పవన్ మళ్లీ జనసేన తరపున తన బాణిని వినిపించాల్సి వస్తోంది. మూడు రాజధానుల్ని వ్యతిరేకించడం పవన్ కి ముప్పుగా మారింది. అమరావతి వాసులు మినహా ఇతర అన్ని ప్రాంతాల్లోనూ జనసేనానిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆల్రెడీ ప్రకటన వచ్చేసింది కాబట్టి ప్రజలకు సీన్ అర్థమైంది. పరిపాలనా వికేంద్రీకరణ చేయకపోతే.. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే సహించలేని పరిస్థితి ప్రజల్లో ఉంది. ఇది ఊహించని పరిణామం. ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో పవన్ రాజకీయాలకు కామా పెట్టి సినిమాల్లోకి వెళతారా? అన్న మరో చర్చా హీటెక్కిస్తోంది.
ఇలాంటి టైమ్ లో గోడ దూకి సినిమాల్లోకి వస్తే రాంగ్ టైమింగ్ అవుతుందేమో! జనసేనాని సన్నివేశం ఎలా ఉంటుందోనన్న చర్చా సాగుతోంది. ఇప్పుడున్న సన్నివేశంలో దిల్ రాజుకు ఏదీ పాలుపోని పరిస్థితి. పవన్ ఇలానే నాన్చితే మునుముందు ప్రణాళికలు అతడికి ఇబ్బందికరమేనని విశ్లేషిస్తున్నారు. ఏడాదికి అరడజను సినిమాల్ని నిర్మిస్తూ దూకుడు మీదున్న ఆయనకు ఇప్పుడు ఇలా బ్రేక్ పడిపోతోంది. 2020 ప్లానింగ్స్ లో దూకుడు పెంచలేని పరిస్థితి ఎదురవుతోంది. ఇక బోనీకపూర్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తో కలిసి చేస్తున్న తొలి చిత్రం కాబట్టి ప్రతిష్ఠాత్మకంగా చేయాల్సి ఉంటుంది. పైగా పవన్ తో డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి వెనక్కి తగ్గినా అది ప్రెస్టేజ్ ఇష్యూ. ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన ఈ టైమ్ లో పవన్ నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటుందా? అందుకేనేమో స్నేహితుడు త్రివిక్రమ్ సైతం ముందే సందేహం వ్యక్తం చేశారు. పవన్ ని సినిమాల్లోకి లాగడం సులువు కాదని అన్నారు ఇందుకేనా?
ఇంతకుముందు జనసేన పార్టీ పెట్టే సమయంలో ఎన్నికల్లోకి దూకే వేళ మైత్రి మూవీ మేకర్స్ కి పవన్ ఇలానే ఇబ్బందిని క్రియేట్ చేశారు. రేపో మాపో సెట్స్ కెళతారు అనుకున్నది అర్థాంతరంగా బ్రేక్ పడింది. మరి ఈసారి పవన్ అలా చేయరు కదా! ఈ డైలమాకి చెక్ పెట్టేదెప్పుడు?