భారతీయుడు సీక్వెల్.. అబ్బే అప్పుడే చెప్పలేం

Update: 2017-10-15 07:23 GMT
కోలీవుడ్ సంచలన దర్శకుడు శంకర్ ఒక సినిమాకోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా షూటింగ్ స్పాట్ నుండి ఒక్క ఫొటో కూడా లీక్ చేయనివ్వకుండా సెక్యూరిటీ లో చాలా జాగ్రత్తగా ఉంటారని టాక్ ఉంది. అంతే కాకుండా సినిమా భారీ బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి నిర్మాతలను కూడా గట్టివారినే ఎంచుకుంటాడు. సినిమా స్టార్ట్ అయ్యిందంటే చాలు బ్రేకులు ఉండకుండా శంకర్ జాగ్రత్తగా ఉంటారు.

అయితే ఆయన తీయబోయే భారతీయుడు 2 కి మాత్రం బ్రేకులు పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సినిమా క్యాన్సిల్ అయ్యిందని కూడా పలు మీడియాలలో కథనాలు వెలువడ్డాయి కానీ దిల్ రాజు మాత్రం అలాంటిది ఏమి లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆయన దగ్గరి సన్నిహితుల సమచారం ప్రకారం సినిమా క్యాన్సిల్ అయితే నేను చెబుతాను కదా.. నేను చెప్పేంత వరకు ఎటువంటి రూమర్స్ ని నమ్మవద్దు. సినిమా తప్పకుండా సెట్స్ పైకి వెళుతోంది అంటున్నాడట దిల్ రాజు.

అంతే కాకుండా ఏ.ఎమ్ రత్నం దిల్ రాజుతో సహా నిర్మాతగా వ్యవహరించాలని చాలా ఇష్టపడుతున్నారట. ఆయన భారతీయుడు మొదటి పార్ట్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీక్వెల్ లో కూడా తనకు బాగామివ్వాలని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాడట. కానీ దిల్ రాజు ఇంకా ఏ నిర్ణయాన్ని చెప్పలేదని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి. అలాగని ఆగిపోయిందని అప్పుడే చెప్పలేం.
Tags:    

Similar News