తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణారెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 'దిల్' సినిమాతో దిల్ రాజుగా మారిపోయిన ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయాలను అందుకుంటూ తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్నాడు. కేవలం డబ్బు పెట్టడం వరకే అని కాకుండా స్టోరీ దగ్గర నుంచి నటీనటుల ఎంపిక వరకు.. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు అన్నీ తానై చూసుకుంటాడు దిల్ రాజు. ఎంతో మంది నటీనటులను దర్శకులను ఇతర టెక్నీషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకి దక్కుతుంది. నేడు (డిసెంబర్ 18) దిల్ రాజు 50వ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులకు ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో దిల్ రాజు మాట్లాడుతూ పేరు డబ్బు.. సక్సెస్ తో పాటు వస్తుంటాయని.. ఇకపై వ్యక్తిగతంగా కూడా సామాజిక సేవలో భాగం అవుతున్నట్లు తెలిపారు.
''నాకు గ్రేట్ మూమెంట్. సక్సెస్ లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి మూమొంట్ రావడం నా అదృష్టం. సినిమా ఫీల్డ్ లోకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. యాబై ఏళ్లలో పాతికేళ్లు సినిమాలతోనే ఉన్నాను. సక్సెస్ లను సాధించాం. ఎదిగాం.. నా జీవితాన్ని షిఫ్ట్ చేయాలని అనుకున్నాను. పేరు డబ్బు.. సక్సెస్ లతో పాటు వస్తుంటాయి. ఈ మధ్యే సెకండ్ లైఫ్ స్టార్ట్ చేశాను. దీని తర్వాత ఏమి చేయాలి అని ఆలోచిస్తుంటే సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. సాధారణంగా ప్రతి ఒక్కరం మన కోసం బతుకుతాం.. మన కోసం సంపాదిస్తాం. ఈ కొత్త లైఫ్ లో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే.. సోషల్ సర్వీస్ అనే థాట్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వారెవరైనా జాయిన్ అయితే ఇంకా బావుంటుంది. మీడియా వాళ్ల దృష్టికి చాలా సమస్యలు వస్తాయి. అలాంటి వాటిలో నిజమైన వాటిని గుర్తించి నా దగ్గరకు తీసుకొస్తే నా వంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా ఎడ్యుకేషన్ - హెల్త్ సమస్యలకు సపోర్ట్ చేస్తాను. ఇది నా 50వ బర్త్ డే నాడు తీసుకుంటున్న డెసిషన్'' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
అయితే దిల్ రాజు నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే రాబోయే రోజుల్లో దిల్ రాజు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని.. ఇది మొదటి స్టెప్ అనుకోవచ్చని కూడా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండే దిల్ రాజు.. ఓ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతున్నాడని.. నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని గత ఎన్నికల సమయంలోనే వార్తలు వచ్చాయి. అయితే దిల్ రాజు మాత్రం దీనిపై సైలెంటుగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు దిల్ రాజు మాటలను బట్టి చూస్తే ఆయన సమాజానికి ఏదైనా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడని.. దీని కోసం త్వరలో పాలిటిక్స్ లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి. కాగా, దిల్ రాజు ఫ్యామిలీ 'మా పల్లె ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా ఇప్పటికే సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను దిల్ రాజు దత్తత తీసుకొని ఈ ట్రస్ట్ ద్వారా వారి బాగోగులు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.