2023 సంవత్సరం సంక్రాంతి పోరులో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు ఏమాత్రం తగ్గకుండా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తమిళ్ సూపర్ స్టార్ విజయ్ యొక్క వారిసు(వారసుడు) సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మొన్నటి వరకు హడావుడి చేశారు.
దిల్ రాజు చేతిలో ఉన్న పవర్ తో చిరు.. బాలయ్యల సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా వారసుడు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఒక మాటకు వస్తే ఆ రెండు సినిమాల కంటే కూడా బెటర్ థియేటర్స్ వారసుడుకు దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటూ కూడా ప్రచారం జరిగింది.
సంక్రాంతి సినిమాల యొక్క సందడి షురూ అయ్యింది. వాల్తేరు వీరయ్య నుండి బ్యాక్ టు బ్యాక్ పాటలు వస్తున్నాయి. ఇప్పటికే ఒక భారీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి వాల్తేరు వీరయ్య సినిమా సంగతులు మైత్రి వారు పంచుకున్నారు. అలాగే వీర సింహారెడ్డి సినిమా నుండి కూడా అనేక సర్ ప్రైజ్ లు వస్తూ సినిమా స్థాయిని పెంచేస్తున్నాయి.
కానీ సంక్రాంతి పోరు లో ఉన్న మరో సినిమా వారసుడు మాత్రం తెలుగు నాట సందడి చేయడం లేదు. కనీసం తమిళనాట అయినా హడావుడి చేస్తున్నాడా అంటే అది కూడా లేదు. వారిసు సినిమా ను పెద్ద ఎత్తున ప్రమోషన్ చేయడం లేదు అంటూ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు.
దిల్ రాజు గత వారం రోజులుగా పూర్తిగా సైలెంట్ గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ఒక్కసారిగా వారసుడు హడావుడి మొదలు పెడుతాడా అనేది తెలియాల్సి ఉంది. కొందరు మాత్రం ఆ రెండు సినిమాలతో పోటీ పడి వారసుడు సినిమాను గెలిపించుకోవడం సాధ్యం కాకపోవచ్చు అని దిల్ రాజుకు అర్థం అయ్యిందేమో.. అందుకే అస్త్ర సన్యాసం చేసి ఉంటారు అంటూ చర్చించుకుంటున్నారు.
టాప్ ప్రొడ్యూసర్ గా.. మూవీ మాస్టర్ గా పేరు దక్కించుకున్న దిల్ రాజు అంత ఈజీగా అస్త్ర సన్యాసం చేసే రకం కాదు. ఆయన సైలెన్స్ వెనుక కచ్చితంగా ఏదైనా వ్యూహం ఉండే ఉంటుంది. విడుదలకు వారం రోజుల ముందు అగ్రెసివ్ గా ప్రమోషన్ చేసినా కూడా రావాల్సిన పబ్లిసిటీ వస్తుంది. ఆ విషయంలో దిల్ రాజు మాస్టర్ బ్రెయిన్. కనుక సంక్రాంతికి కచ్చితంగా ఆయన వారసుడు సత్తా చాటడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.