ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ 'రాధే శ్యామ్' సినిమాను రూపొందించాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించారు .. అదే స్థాయిలో వచ్చేనెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కళ్లుచెదిరిపోయేలా వేదికను ఏర్పాటు చేసిన తీరు బాగుంది. రష్మిక పింక్ డ్రెస్ లో తన ముద్దు ముద్దు మాటలతో సందడి చేస్తే, ప్రభాస్ ను కూడా వదలకుండా నవీన్ చొచ్చుకుపోయి అల్లరి చేశాడు.
ఈ వేదికపై కృష్ణంరాజుకు తగిన గౌరవం ఇచ్చారు. స్క్రీన్ పై ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాల క్లిప్పింగ్స్ తో స్టార్ట్ చేశారు. అలాగే స్టేజ్ పైకి ప్రత్యేకమైన చైర్లో ఆయనను తీసుకుని వచ్చి అందరికంటే ముందుగా మాట్లాడించారు. ఏదేవైనా కృష్ణంరాజు రాకతో వేదికకి ఒక నిండుదనం వచ్చింది. ఇక ఆ తరువాత దిల్ రాజు వంతు రావడంతో ఆయన మాట్లాడుతూ .. "హాయ్ డార్లింగ్స్ .. మీకు ఎలాంటి ఎనర్జీ ఉండాలి? ప్రభాస్ ఫ్యాన్స్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి .. ఆ ఎనర్జీ ఏదీ? నాకు అర్థమైంది సాయంత్రం 5 నుంచి ఇదే ఎనర్జీతో ఉన్నారు .. ఇక హోల్డ్ చేసి పెట్టండి. జనవరి 14వ తేదీన థియేటర్స్ లో చూపించడానికి కావాలి గదా.
ప్రభాస్ తో నా జర్నీ గురించి మీ అందరికీ తెలుసు. చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తోంది నాకు 'రాధేశ్యామ్' ట్రైలర్ చూస్తుంటే. 'డాళింగ్' .. 'మిస్టర్ పెర్ఫెక్ట్' రిలీజ్ అయినప్పుడు మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ .. మాస్ హీరోను ఇంత క్లాస్ గా ఎవరు చూస్తారు అని. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయిపోయిన తరువాత ప్రభాస్ 'మిర్చి' .. 'రెబల్' .. 'బాహుబలి' . 'సాహో'తో ఆకాశానికి వెళ్లిపోయి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మళ్లీ ఇప్పుడు ఎంత క్లాస్ లవ్ స్టోరీ చేశాడో చూడండి. స్టార్ హీరోకి కావాల్సినదదే. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలతో పాటు కొత్తగా ప్రయత్నం చేస్తూ అలరించాలి.
'రాధేశ్యామ్' ట్రైలర్ చూసిన తరువాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వంశీ అండ్ ప్రమోద్ కి నేను ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. రాధాకృష్ణ వెరీ గుడ్ జాబ్ .. ప్రభాస్ - పూజ హెగ్డేలను లవర్స్ లా భలేగా క్రియేట్ చేశావు. సంక్రాంతికి ఈ సినిమా వస్తోంది .. ప్రభాస్ ను అలా మనం స్కైస్ పైనే ఉంచాలి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. డాళింగ్ ఫ్యాన్స్ బీ రెడీ .. థ్యాంక్యూ" అంటూ ముగించాడు.